హైదరాబాద్

కరవు ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: కరవు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌పి సింగ్ ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో డ్వామా, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు తగ్గిపోతున్న భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్త బోర్‌లు వేసేందుకు అనుమతులు ఇవ్వకూడదని ఆదేశించారు. అత్యవసర పరిస్థితిలో సంబంధిత జిల్లా కలెక్టర్‌ల స్వీయ పర్యవేక్షణలో అనుమతి పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన చోట ప్రైవేటు బోర్ల నుండి నీటిని తీసుకుని నీటి ఎద్దడిని అదుపులో ఉంచాలని చెప్పారు. కరవు పనులకు సంబంధించిన మంజూరీలు జూన్‌లోపు పూర్తి చేయాలని, నీటి ఎద్దడిని నివారించేందుకు నీటి పరిరక్షణ పనుల్లో భాగంగా అధిక స్థాయిలో ఫాం పాండ్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. బలహీన వర్గాల కాలనీల్లో ఉపాధి హామీ మార్గదర్శకాల ప్రకారం అంతర్గత సిసి రోడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు అధిక మొత్తం కురుస్తాయన్న ఆశాభావంతో నీటి పరిరక్షణ చర్యలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇంకుడు గుంతలు, ఫాం పాండ్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, కంపోస్ట్ పిట్స్‌కు సంబంధించిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు. అన్ని గ్రామపంచాయతీలలో ఉపాది హామీ కూలీలకు పనులు కల్పించాలని సూచించారు. వర్షాకాలం రాకముందే రైతులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని 24 మండలాల్లో ఉపాది హామీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 19,440 స్వయం సహాయక సంఘాలుండగా సుమారు 14,743 సంఘాలు పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లాలో 457 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఉన్నారని వీరంతా విధుల్లో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. సుమారు 4 లక్షల 3 వేల మంది కూలీలుండగా వారిలో ఇప్పటికే సుమారు 3 లక్షల 47 మందికి సంబంధించి ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందని వివరించారు. ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, కాంపోస్ట్ పిట్స్ పనులు చేపడుతుండగా ఇంకా అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. జూన్‌లో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి మండలాల్లో కార్యాచరణ ప్రణాళికలు ఇప్పటికే రూపొందించామని చెప్పారు. హరితహారంలో భాగంగా 3500 ఎకరాలలో మొక్కలు నాటాల్సి ఉండగా సుమారు 650 ఎకరాల్లో 341 మంది రైతులు మొక్కలు పెంచేందుకు మంజూరీ ఇచ్చినట్టు వరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు అనితారామచంద్రన్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కమిషనర్ సైదులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.