హైదరాబాద్

సర్కిళ్ల సంఖ్యను 30కి పెంచే యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: మహానగర పాలక సంస్థ పరిధిలోని సర్కిళ్ల సంఖ్యను ముప్పైకి పెంచేందుకు జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందక ముందు కేవలం ఏడు, ఆ తర్వాత 18, కొద్ది నెలల క్రితం అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ వీటి సంఖ్యను 24కు పెంచిన సంగతి తెలిసిందే! ఇపుడు తాజాగా ముప్పైకి పెంచే అంశంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. 30కి పెంచి, ప్రస్తుతమున్న అయిదుజోన్లలో ఒక్కోదానిలో ఆరు సర్కిళ్లు వచ్చే దిశగా చేయాలని అధికారులు భావిస్తున్నారు. సంఖ్యను పెంచితే సర్కిళ్ల విస్తీర్ణం తగ్గటంతో అధికారుల పర్యవేక్షణ పెరిగి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆస్కారమేర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పదేళ్ల క్రితం గ్రేటర్‌గా ఏర్పడిన నగరంలో అపుడున్న ఏడు సర్కిళ్లలోనూ పరిపాలన, పౌరసేవల పరంగా కావల్సిన స్థాయిలో సిబ్బంది లేక అనేక ఇబ్బందులుండేవి. దీనికి తోడు ప్రతి నెల పదుల సంఖ్యలో పర్మినెంటు ఉద్యోగులు పదవీ విరమణలు పొందుతున్నందున, వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు అంతంతమాత్రపు సంఖ్యలో ఔట్‌సోర్సు, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను వినియోగిస్తున్నారు. అయినా నేటికీ జిహెచ్‌ఎంసి పనిభారానికి తగిన విధంగా సిబ్బంది లేదు. ప్రస్తుతమున్న 24 సర్కిళ్లలో కూడా కనీసం సర్కిల్‌కు ఒకరు అసిస్టెంటు మెడికల్ అధికారి, ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాల్సిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేరు. ఈ క్రమంలో సర్కిళ్ల సంఖ్యను 30కి పెంచితే ముప్పై మంది డిప్యూటీ కమిషనర్లు, అదే స్థాయిలో అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు ఇతరాత్ర సిబ్బంది అవసరమవుతోంది. పౌరసేవల నిర్వహణ, అభివృద్ధి అంశాలకు సంబంధించి నిత్యం నగర ప్రజల జీవనంతో ముడిపడి ఉండే జిహెచ్‌ఎంసి కార్యకలాపాలను ఎలాంటి ఆటంకాల్లేకుండా సజావుగా నిర్వహించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది కొరత కూడా తీవ్రమయ్యే అవకాశముంది. ముఖ్యంగా నేటికీ కూడా డివిజన్ల వారీగా కార్పొరేటర్ల నిధుల నుంచి పనులను గ్రౌండింగ్ చేసేందుకు అవసరమైన ఇంజనీర్లు కూడా అందుబాటులో లేకపోవటంతో, కార్పొరేటర్లు తమ ఏటా బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సర్కిళ్ల సంఖ్యను 30కు పెంచటం అవసరం లేదన్న వాదనలూ ఉన్నాయి. పరిపాలన, అభివృద్ధి, పౌరసేవల మెరుగైన నిర్వహణ అంశాలను పరిగణలోకి తీసుకుని అధికారులు సర్కిళ్ల సంఖ్యను సవరించాలని భావించినా, ముందుగా ఆయా సర్కిళ్లకు కావల్సిన సిబ్బంది వివరాల ప్రతిపాదనలు సర్కారుకు పంపి, మంజూరీ పొందితే తప్పా, సర్కిళ్ల పెంపు వెనకానున్న అసలు ప్రయత్నం నెరవేరదని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.