హైదరాబాద్

తవ్విన కొదీ దఅక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో ఒకటైన కోఠి ఆసుపత్రిలో వెలుగుచూసిన బ్లడ్ మాఫియాపై తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. అంతేగాక, సర్కారు ఆసుపత్రులంటేనే అంతంతమాత్రంగా నమ్మే ప్రజలు ఈ దవాఖాన అంటేనే హడలెత్తుతున్నారు.
రోగులకు కల్తీ రక్తం ఎక్కిస్తున్న వ్యవహారం వెలుగుచూడటంతో, ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సుల్తాన్‌బజార్ పోలీసులు ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు. తగిన వైద్య పరీక్షలు చేయని నకిలీ రక్తాన్ని రోగులకు ఎక్కిస్తున్నట్టుగా రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసూతి ఆసుపత్రిలో లేబుల్స్ లేని, వివిధ పేరుగాంచిన బ్లడ్ బ్యాంక్‌ల లేబుల్స్‌ను అక్రమంగా వినియోగిస్తూ రోగులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అధికారులు బ్లడ్ మాఫియాపై విచారణ చేపట్టినట్టు కోఠి ప్రసూతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తరుచూ ఈ ఆసుపత్రికి బ్లడ్ యూనిట్లను అందించే ఓ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ రోగులకు ఇస్తున్న బ్లడ్ యూనిట్లను పరిశీలించి, బ్లడ్‌ను కల్తీ చేస్తున్నట్లు నిర్థారించినట్లు తెలిసింది. దాదాపు మూడు, నాలుగు బ్లడ్ యూనిట్‌లను తీసుకుని, అందులో గుట్టుచప్పుడు కాకుండా సెలైన్‌లను కలిపి, నకిలీ బ్లడ్ యూనిట్‌లను తయారుచేసి, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎక్కించడంతో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 180 పడకలుండగా, దాదాపు ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 3, 4 ఆపరేషన్లు చేసి వైద్యులు మహిళలకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి చెందిన వైద్యుల రిక్వైజేషన్ ప్రకారం నగరంలోని ఆరు బ్లడ్ బ్యాంకుల నుంచి బ్లడ్ యూనిట్‌లను సరఫరా చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాల వినతి మేరకు ఆరు బ్లడ్ బ్యాంకుల నుండి ప్రతి నెల ఆరువందల బ్లడ్ యూనిట్‌లను సరఫరా చేస్తున్నారు. నకిలీ బ్లడ్ మాఫియాపై పోలీసులు, వైద్యారోగ్యశాఖలు వేర్వేరుగా విచారణలు చేపడుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన నరేందరప్రసాద్ అనే టెక్నిషియన్ పరారీలో ఉన్నాడు. ఈ నెల 13వ తేదీన ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరి, పద్నాలుగో తేదీన మృతి చెందిన ఇబ్రహీంపట్నంకు చెందిన మేఘమాల అనే గర్భిణికి నకిలీ రక్తం ఎక్కించటంవల్లే మృతి చెందిందంటూ ఆమె కుటుంబీకులు శుక్రవారం ప్రసూతి ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నకుమారి ఆసుపత్రికి వస్తున్న బ్లడ్ యూనిట్ల దుర్వినియోగం విషయానికి సంబంధించి విచారణ చేపట్టాలని కోరుతూ సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ పి. శివశంకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు నరేంద్రప్రసాద్‌పై సెక్షన్ 420, కాపిరైట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి. రామకృష్ణ తెలిపారు.