హైదరాబాద్

సకాలంలో పైపులైన్ పనులు పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిన శివారు మున్సిపల్ సర్కిల్‌లో తాగునీటి సరఫరా వ్యవస్థ కోసం రూ.1900 కోట్ల హడ్కో రుణంతో పాటు ప్రభుత్వం రూ.200కోట్లతో మంచినీటి పైప్‌లైన్, రిజర్వాయర్‌ల నిర్మాణం చేపడుతోంది. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఫథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఎంతో కృత నిశ్చయంతో ముందుగు సాగుతోంది. అంతే కాకుండా తెలంగాణ పురపాలక శాఖ అధ్వర్యంలో వందరోజుల యాక్షన్ ప్లాన్ పనులను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జలమండలి పరంగా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై జలమండలి ఎండి దానకిషోర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఖైర్‌తాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఎండి ప్రాజెక్ట్ విభాగానికి చెందిన డైరెక్టర్లు, సిజిఎం, జిఎం స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటికీ నల్లా కార్యక్రమం విజయవంతం అయ్యేలా అధికారులందరూ కలిసి సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గోదావరి ప్రాజెక్ట్‌తో పాటు శివారు మున్సిపాల్టీలో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్, రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి ఎండి డైరెక్టర్లు, సిజిఎం, జిఎంలతో సమావేశమై సమీక్ష జరిపారు. 2017 నాటికి పనులు పూర్తిచేసి నీటి సరఫరాను కొనసాగించాలని ఎండి అధికారులను అదేశించారు. అదేవిధంగా జలమండలి పరంగా చేపడుతున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపడుతున్న పనులపై ఎండి ఆరా తీశారు. రూ.21వందల కోట్ల రూపాయలతో రాజేంద్రనగర్, ఆల్వాల్, కాప్రా, ఎల్‌బీనగర్, గడ్డిఅన్నారం, ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రామచంద్రపూరం, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ తదితర మున్సిపాల్టీలో మంచినీటి వ్యవస్థను మెరుగు పర్చడానికి దాదాపు 2వేల కీలో మీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణంతో పాటు దాదాపు 56 రిజర్వాయర్లను నిర్మిస్తామని, ఈపనులను 2017 నాటికి పూర్తి చేయాలని ఎండి దానకిషోర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, ఎం.కొండారెడ్డి, డి.శ్రీ్ధర్‌బాబు, ఆజ్మీరాకృష్ణలతో పాటు పలువురు సిజఎం, జిఎంలు పాల్గొన్నారు.