హైదరాబాద్

విద్యతోపాటు సంస్కారాన్ని పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: చదువుకునే విద్యార్థులు కేవలం పుస్తకాల జ్ఞానమే కాకుండా సంస్కారాన్ని కూడా పెంచుకోవాలని స్వామి వివేకానందను స్పూర్తిగా తీసుకోవాలని తెలంగాణ బిసి సంక్షేమ శాఖమంత్రి జోగు రామన్న అన్నారు. మహాత్మా జ్యోతిబాయిపూలే తెలంగాణ బిసి సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో జరిగిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి మంత్రి జోగు రామన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను 10వ తరగతిలో అద్భుతమైన రిజల్ట్సు చూపించారని భవిష్యత్తులో విద్యార్థులు జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
చదువును ఆయుధంగా ఉపయోగించుకుని ప్రతి విద్యార్థి ఆశయ సాధనకు కృషిచేయాలన్నారు. చాలామంది విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక చదువు మానేస్తున్నారని ఇటువంటి వారి కోసమే ముఖ్యమంత్రి కేసిఆర్ కెజి టు పిజి ఉచిత విద్యను ప్రవేశపెట్టారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆలస్యమవుతున్నప్పటికీ తప్పకుండా ఆ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని మంత్రి జోగు రామన్న తెలిపారు. కొత్తగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని, అందువల్ల చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవడానికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు.
గురుకుల విద్యార్థులలో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతోపాటు 10వేల రూపాయల క్యాష్ అవార్డునుకూడా అందిస్తామని మంత్రి జోగు రామన్న ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్, బి.సి సంక్షేమ శాఖ కమిషనర్ జిడి అమృతలు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల సెక్రటరీ మల్లయ్య భట్టు స్వాగతం పలుకుతూ తమ విద్యాసంస్థద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించారు. తొలుత బాల బాలికలు పలు రకాల శాస్ర్తియ, జానపద నృత్యాలతోపాటు గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.

హైకోర్టు విభజన విషయంలో
తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష తగదు
చార్మినార్, మే 25: ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలోకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హెచ్చరించింది. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో జెఏసి ప్రతినిధులు టి.శ్రీరంగంరావు, కొండారెడ్డి, ఉపేందర్, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రానే్న ఇస్తామని గతంలో చెప్పిన బిజెపి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హైకోర్టును కూడా విభజించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన విషయంలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టులోని ఆంధ్ర న్యాయమూర్తులు అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులలో ఆంధ్రకు చెందినన వారు 18 మంది ఉండగా, తెలంగాణకు కేవలం ముగ్గురే ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ కూడా తీవ్ర నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎంఎల్‌సిగా రాంచందర్‌రావును గెలిపిస్తే త్వరలోనే హైకోర్టు విభజన ప్రక్రియను చేపట్టగలమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు చెప్పుచేతల్లో పనిచేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన విషయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నేతలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని త్వరలో కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజన ప్రకటన చేయకపోతే జూన్ ఆరవ తేదీ నుంచి న్యాయమూర్తులు, ఉద్యోగులు, న్యాయవాదులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టగలమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు కొమురయ్య, చంద్రారెడ్డి, అనీల్‌కుమార్ పాల్గొన్నారు.