హైదరాబాద్

28న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న రిజర్వాయర్‌లను ప్రతి సంవత్సరం శుద్ధి చేస్తారు. ఇందులో భాగంగానే రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేసి శుభ్రం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పనుల్లో భాగంగా ఈనెల 28న రాత్రి తొమ్మిది గంటల నుండి మరుసటి రోజు 29 రాత్రి తొమ్మిది గంటలవరకు నీటి సరఫరాను నిలిపివేసి పలు రిజర్వాయర్‌లను క్లీన్ చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. దీంతో ఈనెల 28న ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
* 28న నీటి సరఫరా ఉండని ప్రాంతాలు: కొత్తగూడ, కొండాపూర్, గచ్చిబౌలి విలేజ్, మదాపూర్, గుట్టల బేగంపేట్, అయ్యప్పసొసైటీ, కావేరిహిల్స్, రాఘవేంద్ర కాలనీ, ఇందిరానగర్, పిజెఆర్ నగర్, అంజయ్యనగర్, ఇజ్జత్‌నగర్, కుమ్మరిబస్తీ, వడ్డెరబస్తీ, ఇటిసి, గోపినగర్, నెహ్రూనగర్, ప్రశాంత్‌నగర్, రాజీవ్ గృహకల్ప, గుల్‌మోహర్‌పార్క్, నలగండ్ల, ఐటి బల్క్‌సప్లైస్, హఫీజ్‌పేట్, వైశాలినగర్, బిహెచ్‌ఇఎల్, ఎంఐజి, చందనగర్, ఇటిసి, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ఫేజ్ 4, 6, 7, 9, మాలేషియాటౌన్‌షిప్, బోరబండ, సఫ్‌ధార్ నగర్, రామారావునగర్, పెద్దమ్మనగర్, గాయత్రినగర్, శ్రీరామ్‌నగర్ తదితర ప్రాంతాలు.