హైదరాబాద్

నకిలీ వీసాలతో విదేశాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: ఉద్యోగాల పేరిట ఏజెంట్ల మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏజెంట్లు నకిలీ వీసాలతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఉద్యోగాల ఆశతో మహిళలు ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. పని మనిషిగా వెళ్లే మహిళలు తిరిగి రావడంలో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. అరబ్బుల చేతుల్లో చిత్రహింసలకు గురవుతున్నారు. ఆర్థికంగా మోసపోయిన మహిళలు తిరిగి స్వదేశానికి వద్దామనుకుంటే ఏజెంట్లు వారికి సహకరించడం లేదు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులు ఉద్యోగాల కోసం సౌదీకి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులను ఆశ్రయించిన వారి కుటుంబీకులు తమ పిల్లలు ఎప్పుడు వస్తారా..అని ఎదురుచూస్తున్నారు. అయితే వారిని సౌదీకి పంపిన ఏజెంట్ పరారీలో ఉండగా, అక్కడి (విదేశం) ట్రావెల్ నిర్వాహకులు మాత్రం ఆరు లక్షలు చెల్లిస్తే గానీ వారిని పంపేది లేదని అంటున్నట్టు సమాచారం. ఇటీవల మలక్‌పేటకు చెందిన ఏజెంట్ ముస్కాన్ పాతబస్తీకి చెందిన ముగ్గురు యువతులను ఉద్యోగాల పేరుతో రియాద్‌కు పంపించింది. రెయిన్ బజార్‌కు చెందిన ఆసిమా ఖతూన్, ముస్కాన్ కలసి చాదర్‌ఘాట్‌కు చెందిన షమీమ్, అనీస్ ఫాతిమా, మరో యువతిని రియాద్‌కు పంపించారు. కాగా వీరు అక్కడ పడుతున్న బాధలు చెబుతూ ఏజెంట్ తమను మోసగించాడంటూ నగరానికి సమాచారమిచ్చారు. దీంతో షమీమ్ తండ్రి మహమ్మద్ ఇస్మాయిల్, నగరంలోని ఏజెంట్ ముస్కాన్‌ను సంప్రదించగా ఆరు లక్షలు ఇస్తేగానీ ముగ్గురిని వదలమని చెప్పాడు. దీంతో ఇస్మాయిల్ రెయిన్ బజార్, చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ముస్కాన్ ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉంది. కాగా ముగ్గురు యువతులు ఎక్కడున్నది ఇప్పటి వరకు తెలియలేదని ఇస్మాయిల్ వాపోయారు. గత రెండు నెలల్లో ఇలా ఎంతోమందిని ఏజెంట్లు మోసం చేశారు. ఇటీవల టోలిచౌక్‌కు చెందిన ఏజెంట్ మహమ్మద్ అన్వరుద్దీన్, హిమాయత్‌నగర్‌కు చెందిన మహమ్మద్ నవాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా వారు బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఏజెంట్లు పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఏజెంట్లు ముంబయి ఫ్రాంచైజ్‌లను నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, నిరుద్యోగులు ఏజెంట్ల చేతుల్లో మోసపోవద్దని, వీసా సరైనదా, కాదా అని తెలుసుకున్న తరువాతే విదేశాలకు వెళ్లాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ టాస్క్ఫోర్స్ లింబారెడ్డి సూచించారు.