హైదరాబాద్

నగరంలో మీరట్ గ్యాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: రాజధాని నగరంలో మీరట్ గ్యాంగ్ ముఠా సంచరిస్తోంది. దృష్టి మరల్చి సెల్‌ఫోన్లు చోరీ చేసే ఈ ముఠాలోని ఇద్దరు సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ. 40,300లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన వసీం సలీమ్ ఖురేషి (23) షకీల్ సలీం ఖురేషి (24) మహమ్మద్ ఆసిఫ్ (20) వీరు నాంపల్లి హోటల్ అజీజియా ఎదురుగా తిష్ట వేసి సిగ్నల్ క్రాసింగ్‌ల వద్ద సంపన్నులను పసిగడతారు. సిగ్నల్స్ వద్ద కారు స్లో కాగానే వీరిలో ఒకరు కారు పక్కనే నిలబడి కారు కాలికి తగిలిందని డ్రైవర్‌తో గొడవకు దిగుతాడు. దీంతో డ్రైవర్ కారు దిగగానే మరొకరు మరో డోర్ వైపు నుంచి కారులో ఉన్న వారితో మాటలు కలుపుతాడు.
కారులోని వారు కూడా కిందకు దిగుతారు. దీంతో మూడో వ్యక్తి కారులోని ఖరీదైన వారి సెల్‌ఫోన్లను తస్కరిస్తాడు. జల్సాలకు అలవాటుపడిన వీరు రోజూ రెండు, మూడు ఖరీదైన పోన్లు చోరీ చేస్తారు. ఇటీవల లక్డికాపూల్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సెంట్రల్ జోన్ పోలీసులు గురువారం వీరిని వలపన్ని పట్టుకున్నారు. వసీం, షకీల్ పోలీసులకు చిక్కగా, ఆసిఫ్ పరారయ్యాడు. వీరి నుంచి మూడు సెల్‌ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్టు టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ బి లింబారెడ్డి తెలిపారు.