హైదరాబాద్

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: కేవలం అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణే గాక, నగరంలోని నిరుద్యోగ యువతకు తమ అర్హతలు, పని నైపుణ్యతను బట్టి తగిన ఉద్యోగాలను ఇప్పించటంలోనూ జిహెచ్‌ఎంసి తనదైన పాత్ర పోషిస్తుందని బిజెపి ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతలరామచంద్రారెడ్డి, కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అన్నారు. జిహెచ్‌ఎంసి నిర్వహించే జాబ్‌మేళాలను మరింత ఎక్కువ మంది నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని అసలైన సంకల్పాన్ని నిజం చేయాలని వారు సూచించారు. జిహెచ్‌ఎంసి అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో గురువారం నారాయణగూడలోని కేశవ్‌మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన జాబ్‌మేళాను కమిషనర్ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి ప్రారంభించారు. వారు నేరుగా నిరుద్యోగ యువకులను కలిసి వారి అర్హతలు, ఆసక్తి కల్గిన ఉద్యోగం వంటి అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్త్ పాస్/ ఫెయిల్ అయిన నిరుద్యోగులు మొదలుకుని ఐటిఐ, ఇంటర్, డిగ్రీ(బిఎస్సీ, ఎమ్మెస్సీ, ఫార్మసీ), ఎంబిఏ, బిటెక్, ఎంసిఏ, పాలిటెక్నిక్, ఐటిఐ/డిప్లోమా అర్హత కల్గి 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు గల వారు మొత్తం సుమారు 3వేల మంది వరకు ఈ జాబ్‌మేళాకు హజరయ్యారని తెలిపారు. రెండురోజుల పాటు నిర్వహించనున్న ఈ మేళాలో మొదటి రోజైన గురువారం ఉదయం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, మరుసటిరోజైన శుక్రవారం నాడు అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఆర్గనైజర్స్ పరిచయం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 56 వరకు కార్పొరేట్ సంస్థలు ఈ మేళాలో పాల్గొని, శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఆయా కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్‌లతో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, అభ్యర్థుల అర్హతకు తగిన ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, సెంట్రల్ జోన్ అధికార యంత్రాంగం పాల్గొంది.