హైదరాబాద్

నవంబర్ వరకు కంటోనె్మంట్ రోడ్ల మూసివేత వాయదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, మే 27: కంటోనె్మంట్‌లో రోడ్ల మూసివేత నిర్ణయాన్ని మరో ఆరుమాసాలు పాటు వాయిదా వేస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అధికారికంగా కంటోనె్మంట్ బోర్డు కార్యాలయానికి, బొల్లారంలోని తెలంగాణ మిలటరీ సబ్ ఏరియా కమాండర్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.
ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం నవంబరు 30 వరకు రోడ్లను మూసివేయకుండా యథాస్థితిని కొనసాగిస్తారు. జూన్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానికులతో సమావేశమై సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారని కేంద్రరక్షణ శాఖ అండర్ సెక్రటరీ యస్‌కె ఝా ఉత్తర్వులు జారీచేశారు.
రోడ్లు మూసివేతకు రెండు వారాల ముందు మిలటరీ అధికారులు జూన్ ఒకటి నుండి రోడ్లు మూసివేస్తామనీ నోటీసులు ఏర్పాటు చేయటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని అధికార ప్రతినిధి వేణుగోపాలచారి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌తో, రక్షణ శాఖ అధికారులతో రెండు వారాలుగా సాగించిన చర్చల ఫలితంగా మే 19న అధికారికంగా నోటును రక్షణ శాఖ అమోదించింది. దీని ప్రకారం మరో ఆరుమాసాలపాటు వాయిదా వేయటానికి హామీ ఇచ్చి ఉత్తర్వులు జారీచేశారు. ఈలోపు మిలటరీ అధికారులతో కల్సి ప్రజల రవాణా సౌకర్యం కోసం ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఈమేరకు వేణుగోపాలచారి న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. సికింద్రబాద్ కంటోనె్మంట్ ఇతర ప్రాంతాల్లో మిలటరీ అధికారులు గత 10 సంవత్సరాలుగా వారి స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉండటానికి రక్షణగా ఫెన్సింగ్ వెయ్యటం, ప్రస్తుతం ఉన్న ప్రహరీ గోడల ఎత్తు పెంచటం నిర్వహిస్తున్నారు. దీనితోపాటు మిలటరీ ప్రాంతంలోని అంతర్‌గత రోడ్లు మూసివేస్తూ వస్తున్నారు. తిరుమలగిరి, గాంధీ నగర్‌లో, బుచ్చర్‌లైన్స్‌లో, సెంట్రల్ బ్యాటరీ ప్రాంతంలో, ఓల్డు గాంధీ నగర్, కౌకూర్, యాప్రాల్, బోల్లారం, గోల్పుకోర్టు , విలేరియన్ గ్రామర్ స్కూల్, బోయిన్‌పల్లి, ఫెరోజ్‌గుడ, ఓల్డు బోయిన్‌పల్లి ప్రాంతంలోని రోడ్లు మూసివేశారు. అక్కడ జన సాంద్రత తక్కువ ఉంటుందికనుక ప్రజల నుండి పూర్తిస్థాయిలో వ్యతిరేకత రాలేదు కాని ఎఒసి నుండి మల్కాజిగిరి సఫిల్‌గూడ, ఈస్టు మారేడ్‌పల్లినుండి రామకృష్ణపురం, తిరుమలగిరి చౌరస్తానుండి ఆర్మీ స్కూల్ మీదుగా రామకృష్ణపురం వరకు ఉన్న రోడ్లను మూసివేస్తామనటంతోనే సమస్య ప్రారంభమైంది. రెండు సంవత్సరాలుగా మూసివేత అంశం సీరియస్‌గా కొనసాగుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోని వెంటనే పరిష్కారం చూడాలనీ కోరుతున్నారు . రాష్ట్ర మంత్రి జోక్యం చేసుకుని శాశ్వతంగా రోడ్లు మూసివేత, ప్రత్యామ్నాయ రోడ్ల అంశం తేల్చాలనీ స్థానికులు కోరుతున్నారు.