హైదరాబాద్

మొదలైన వసూళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: నూతన విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అడ్మిషన్ల కోసం ప్రైవేటు స్కూళ్లు హడావుడి చేస్తున్నాయి. నో డోనేషన్..అంటూనే తల్లిదండ్రులను ఆకట్టుకుని, ఆ తర్వాత రకరకాలుగా భారీగా ఫీజులు వడ్డించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే ప్రైవేటు స్కూళ్లలో వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు జూన్ 11 అంటేనే ఉలిక్కిపడుతున్నారు. క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్ వంటి ఫీజుల నియంత్రణ కోసం రెండున్నరేళ్ల క్రితం రూపొందించిన చట్టం అటకెక్కింది. ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పాఠశాల విద్యా కార్యాలయం ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టినా ఫలితం దక్కలేదు. దీంతో జేఏసి ఫర్ స్కూల్ ఫీ రెగ్యులేటరీ ఆధ్వర్యంలో ఈనెల 11న ఇందిరాపార్కు వద్ధ మహాధర్నా నిర్వహించనున్నట్లు జేఏసి చైర్ పర్సన్ అరవింద జాట తెలిపారు. గతంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలుకై గతంలో ఓ కమిటీని నియమించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపినా, నేటికీ అతీగతీలేదు. ప్రయివేటు పాఠశాలలు, కాలేజీల అనుమతికి సంబంధించి విద్యా శాఖ నిబంధనలను సైతం తుంగలో తొక్కి అందినంత దండుకుని విచ్చలవిడిగా అనుమతులు జారీ చేసిన సర్కారుకు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావటం ఓ సవాలుగానే మారే అవకాశముంది. విద్యార్థులు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ మాట దేవుడెరుగు, కనీసం పార్కింగ్ వసతి కూడా లేని ప్రయివేటు పాఠశాలలు గ్రేటర్ నగరంలో యథేచ్చగా కొనసాగుతున్నాయంటే విద్యా శాఖకు చెందిన డిప్యూటీ డిఇవోలు, ఇన్‌స్పెక్టర్లు ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారో అంఛనా వేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో కొనసాగుతున్న పలు ప్రయివేటు పాఠశాలల నిర్వహణలో విద్యాశాఖకు చెందిన కొందరు అధికారులు భాగస్వాములుగా కొనసాగుతుండటం ఆశ్చర్యకరం. అందుకే రెండున్నరేళ్ల క్రితమే ఫీజుల నియంత్రణ చట్టం వచ్చినా అది అమలుకు నోచుకోలేక మరుగునపడిందనే చెప్పవచ్చు. ఇపుడు కార్పొరేట్, ప్రయివేటు విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న సర్కారు ఇందుకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్లేమీ ఉండటం లేదు.
ఈ చట్టం ప్రకారం క్యాపిటేషన్, డొనేషన్ ఫీజులు అసలు వసూలు చేయొద్దన్న నిబంధన ఉన్నా, ఎక్కడా అమలు కావటం లేదు. విద్యా విధానం, అందులోని లోపాలను సరి చేయటంలో సర్కారు వహిస్తున్న అలసత్వమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
పుట్టగొడుగుల్లా..ప్రయివేటు స్కూళ్లు
నగరంలోని 16 మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో రెండు మలిగీల్లో, కమ్యూనిటీ హాళ్లలో కూడా ప్రయివేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉందంటే మరీ ఆశ్చర్యం. నిబంధనల ప్రకారం తరగతికి కనీసం రెండు గదులు, విశాలమైన క్రీడామైదానం, ల్యాబ్‌లతో పాటు సొంత భవనం, అందులో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు, నిపుణులైన ఫ్యాకల్టీ, నిర్వాహకుడు విద్యావంతుడై ఉండాలన్న నిబంధనలున్నాయి. కానీ రెండు మూడు గదుల్లో, పదో తరగతి వరకు చదువుకున్న ఇద్దరు ముగ్గురు టీచర్లు, విద్యావంతుల మాట దేవుడెరుగు శివార్లలో కొందరు రౌడీలు కూడా ప్రయివేటు స్కూళ్లు నిర్వహిస్తున్నారంటే ప్రయివేటు పాఠశాలల అనుమతులు, క్షేత్ర స్థాయి తనిఖీల పట్ల విద్యాశాఖ అనుసరిస్తున్న నిర్లక్ష్యపు తీరును అంఛనా వేసుకోవచ్చు.
లెజిస్లేచర్ చట్టం తేవాలి
-జేఏసి చైర్‌పర్సన్ అరవింద జాట
ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా చేస్తున్న ఫీజుల వసూళ్లు, పెంపును నియంత్రించేందుకు ప్రభుత్వం జివోలు జారీ చేయటం కాకుండా లెజిస్లేచర్ చట్టాన్ని తీసుకురావాలని జేఏసి ఫర్ స్కూల్ ఫీ రెగ్యులేటరీ చైర్ పర్సన్ అరవింద జాట కోరారు. దీంతో పాటు 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎలాంటి ఫీజుల పెంపు ఉండబోదని అన్ని స్కూళ్ల యాజమాన్యాలు సర్కారుకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఫీజు రెగ్యులరిటీ కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లతో 11న ధర్నా చేయనున్నట్లు ఆమె తెలిపారు.