హైదరాబాద్

పాతబస్తీలో రంజాన్ ఏర్పాట్ల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: రంజాన్ మాసం సందర్భంగా జలమండలి పరంగా చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా బోర్డు మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావు పాతబస్తీలోని పలు ప్రాంతాలను సోమవారం సందర్శించి చేపడుతున్న, చేపట్టనున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఇందులో భాగంగా పాతబస్తీలో ప్రధానమైన చార్మినార్, మక్కామసీదుతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 180 మసీదుల వద్ద జలమండలిపరంగా ఎండి దానాకిశోర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన మసీదు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలను ఎప్పటికపుడు శుభ్రం చేస్తూ, అవసరమైన చోట డ్రైనేజీ కవర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు డైరెక్టర్ సూచించారు. మసీదు, ఈద్గాల వద్ద డ్రైనేజీ ఓవర్‌ఫ్లో వంటివి జరుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం డివిజన్‌ల వారీగా జనరల్‌మేనేజర్‌లు ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరవేయలని సూచించారు.
జూన్ ఆరవ తేదీ లోపు డిసెల్టింగ్ పనులను మసీదుల వద్ద పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరాను కూడా అధికారులు ఎప్పటికపుడు పరిశీలిస్తుండాలని, బస్తీలో కూడా నీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసంలో మసీదులకు కావాల్సిన నీటిని ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేసేందుకు తదనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు.
డివిజన్-2, 4 పరిధిలోని పబ్లిక్ గార్డెన్, అఫ్జల్‌గంజ్, గౌలిగూడ తదితర ప్రాంతాల్లో జలమండలి డైరెక్టర్ జి.రామేశ్వరరావు సిజఎం, జిఎం, డిజిఎంలతో కలిసి మసీదు, ఈద్గాలను సందర్శించారు. రంజాన్ మాసంలో ప్రార్థనకు వచ్చే మసీదు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్‌ఫ్లో, నీటి సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రామేశ్వరరావు అధికారులను ఆదేశించారు.