హైదరాబాద్

స్వర్గం హృదయంలోనే ఉందనుకుంటే జీవితమే ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: మనిషి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఆ స్వర్గం నీ హృదయంలోనే ఉందనుకుంటే జీవితమంతా ఆనందం మానవాళి అభ్యున్నతికి కృషి చేస్తే కలిగే ఆనందమే హృదయానందం. బుద్ధుడు, పూలె, అంబేద్కర్‌లు మానవాళి కోసం జీవితాలను త్యాగం చేసారు అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం రవీంద్రభారతిలో జీవన సాఫల్య పురస్కారాలు, సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవానికి స్వామిగౌడ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. పొగాకువల్ల శరీరం దెబ్బతిని క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుందని, పొగాకును విస్మరించండి అని, దుర్యవ్యసనాలు మానండి బ్రహ్మకుమారీలు చేస్తున్న ప్రచారాన్ని స్వామిగౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్, పి.నరసింహాల దంపతులను సత్కరించి జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం ఎంపిక చేసిన 20 మందికి సేవారత్న పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ నటి, టిడిపి నాయకురాలు కవిత మాట్లాడుతూ పురస్కార గ్రహీతలను అభినందించారు. తొలుత అంబేద్కర్ సేవా కార్యక్రమాలు ప్రచారం చేసే ఎబిఆర్ చానల్‌ను ప్రారంభించారు. జిఎ నేతాజి స్వాగతం పలుకుతూ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు తెలిపారు. తొలుత వరంగల్‌కు చెందిన నాట్యాచారిణి ఉదయశ్రీ శాస్ర్తియ నృత్యం ప్రదర్శించింది.