హైదరాబాద్

తెరాసలో మహిళలకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, మే 30: తెరాసలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామనీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో నామినేటెడ్ కో- ఆప్షన్ సభ్యురాలిగా నియమితులైన గొట్టిముక్కల జ్యోతిని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో కల్సి సన్మానించారు.
బిసిలు రాజకీయంగా ఎదగాలనీ దాని ద్వారా వారి వారి సామాజిక వర్గాల సమస్యలకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందనీ చెప్పారు. తెరాస ప్రభుత్వంలో గ్రేటర్ ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత నిచ్చామనీ అందులో భాగంగా సగం సీట్లు వారికి కేటాయించామనీ కో- ఆప్షన్ సభ్యుల నియమాకంలో కూడ మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చిందనీ వివరించారు. రాజకీయ పదవుల ద్వారా ప్రజలకు నేరుగా సేవ చెసే అవకాశం ఉందనీ జ్యోతి సైతం గతంలో అల్వాల్‌లో కౌన్సిలర్‌గా సేవలు అందిచారనీ ఆమె అనుభవాన్ని దృష్ఠిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఆమెను కో- ఆప్షన్ సభ్యురాలిగా అవకాశం కల్పించారనీ చెప్పారు. కార్యక్రమంలో గౌడసంఘం ప్రతినిథులు పల్లె లక్ష్మణ్ గౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్, అల్వాల్ సంఘం నాయకులు ప్రకాష్, గణేష్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు.
మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో జోరుగా ల్యాండ్ సెటిల్‌మెంట్‌లు
గచ్చిబౌలి, మే 30: సైబరాబాద్ కమిషనరేట్‌లో హైటెక్ పోలీసు స్టేషన్‌గా పిలువబడుతున్న మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ల్యాండ్ సెటిల్‌మెంట్‌లు జోరుగా కొనసాగుతున్నాయి. పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించగానే పెద్ద పెద్ద అక్షరాలతో సివిల్ తగదాలు పరిష్కరించబడవు అని రాసి ఉంటుంది.
అక్కడ జరిగేవి అన్నీ సివిల్ కేసులే. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు పోటీపడి డబ్బులు, ప్లాటులు సంపాదించడమే ఆనవాయితీగా మారింది. 1996లో పోలీసు స్టేషన్ ఏర్పాటు నుండి చాలామంది అధికారులు భూ వివాదాలలో తలదూర్చి సస్పెండ్ అవడం, బదిలీ అవడం అలవాటుగా మారిందని, ఇక్కడ పోస్టింగ్ కోసం పోటీతత్వం ఉంటుందన్నారు.
భూవివాదాలు, పైరవీలు రోజూ కోట్లలో సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాదాపూర్, గుట్టల బేగంపేటలోని రవీంద్రసొసైటీ, పల్లవి ఎన్‌క్లేవ్, గురుకుల ట్రస్టు, పత్రికానగర్, ఖానామెట్, ఇజ్జత్‌నగర్, కొండాపూర్ ప్రాంతాలలో భూవివాదాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇద్దరు ఎస్‌ఐలకు సైబరాబాద్ కమిషనర్ చార్జి మెమో ఇచ్చి బదిలీ చేయకపోవడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురుకుల ట్రస్టు, రవీంద్ర సొసైటీ భూములకు సంబంధమున్న వ్యక్తిని తీసుకువచ్చి మూడు రోజులు స్టేషన్‌లో ఉంచుకున్నట్లు సమాచారం.
అప్పటి కమిషనర్ ఆగ్రహానికి గురై బదిలీని ఆపుకున్న అధికారే ల్యాండు సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు, స్టేషన్‌లో ఏమి జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాల్సిన ఎస్‌బి అధికారులు సెటిల్‌మెంట్‌ల గురించి పట్టించుకోకపోవడం శోఛనీయం.
ఉద్యోగావకాశాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలి
హైదరాబాద్, మే 30: వికలాంగుల కోటాలో ఉద్యోగాలపై నోటిఫికేషన్ జారీ అయినప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హైదరాబాద్ జిల్లా కలెక్టరు రాహుల్ బొజ్జా సంబంధిత దరఖాస్తుదారులకు సూచించారు.
సోమవారంనాడు కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమంలో ఎజెసి అశోక్‌కుమార్‌తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురు వికలాంగులైన నిరుద్యోగ యువత తమకు ఉద్యోగాలు కల్పించాల్సిందిగా వినతులు సమర్పించగా, వికలాంగుల కోటాలో ఉద్యోగ ఖాళీల మేరకు నోటిఫికేషన్ వెలువడినపుడు దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్, అర్హతల మేరకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.బేగంపేటకు చెందిన రాజయ్య తన కుమారుడు యాదయ్య ఇటీవల ప్రమాదంలో చనిపోయాడని, కోడలు మరో పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిందని వారి ఇద్దరి పిల్లలను తామే పోషిస్తున్నామని తెలుపుతూ, ఆ ఇద్దరి చిన్నారులకు ఆపద్బంధు పథకం కింద సహాయం అందించాల్సిందిగా కలెక్టరును అభ్యర్థించారు.
కలెక్టరు స్పందిస్తూ సంబంధిత దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శాలిబండ, నాగులచింతకు చెందిన వృద్ధురాలు తన భర్త జంగయ్య ఇటీవల మరణించాడని, తాము గత 55 సంవత్సరాల నుండి ఇంటి నెంబరు 23-5-794/1లో నివసిస్తున్నామని, తన నలుగురి పిల్లల వివాహం కూడా అక్కడే చేయడం జరిగిందని, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జీఓ 58 కింద తమ ఇంటిని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. కావున తమ 90 గజాల ఇంటి స్థలానికి పట్టా ఇప్పించాలని కలెక్టరును కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.