హైదరాబాద్

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్ పరీక్షలకు 172 మంది విద్యార్థుల గైర్హాజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: ఇంటర్మీడియట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం ఉదయం ఇంటర్మీడియెట్ ఫస్టియర్ జియాలజి, హోమ్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ అండ్ బ్రిడ్జ్ కోర్సెస్ మధ్యాహ్నం ఇంటర్ సెకండియర్ జియాలజి, హోమ్‌సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ అండ్ బ్రిడ్జ్ కోర్సెస్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఆర్‌ఐఓ మరియు కన్వినర్ ఎ.రవికుమార్ తెలిపారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 418 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 246 మంది పరీక్షలు వ్రాశారని, 172 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. డిస్ట్రిక్ట్ ఎగ్జ్సామినేషన్ కమిటీ, స్వ్కాడ్ బృందాలు 15 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.మధ్యాహ్నం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 167 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 82 మంది పరీక్షలు వ్రాశారని, 85 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. డిస్ట్రిక్ట్ ఎగ్జ్సామినేషన్ కమిటీ, స్క్వాడ్ బృందాలు 13 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.