హైదరాబాద్

రెండురోజుల్లో డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: జిహెచ్‌ఎంసి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. డివిజన్ల రిజర్వేషన్లు రెండురోజుల్లో ఖరారు కానున్నట్లు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఎన్నికల సంఘానికి పంపటం, షెడ్యూల్, నోటిఫికేషన్ల జారీ మినహా ఎన్నికల నిర్వహణకు మహానగర పాలక సంస్థ సర్వం సిద్ధం చేసింది. రెండురోజుల్లో డివిజన్ల రిజర్వేషన్లు ఎన్నికల సంఘానికి అందుతాయని, ఆ వెంటనే జనవరి 4వ తేదీన షెడ్యూల్, ఆ తర్వాతి రోజు నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు సంఘం ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్‌లోని 150 డివిజన్లకు ఒక్కోదానికి ఇద్దరు పరిశీలకులను సైతం నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించిన సంగతి తెలిసిందే! అంతేగాక, సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, విధి నిర్వహణ పట్ల పలు సూచనలు, సలహాలిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వీలుగా సిబ్బంది మిలటరీ క్రమశిక్షణతో పనిచేయాలని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఓటరు జాబితా సవరణ
జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ కొత్త ఓటర్ల నమోదు, జాబితా సవరణను కొనసాగించనున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నగరంలో ఇప్పటి వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పునఃపరిశీలన అంశాలకు సంబంధించి 3లక్షల 91వేల 369 అభ్యర్థనలు వచ్చాయని, వీటిలో 2లక్షల 90వేల 942 దరఖాస్తులను పరిశీలించి ఆమోదించినట్లు తెలిపారు. 46వేల 612 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 54వేల 365 అభ్యర్థులను పరిశీలించాల్సి ఉందని ఆయన వివరించారు. అయితే కొత్త ఓటర్ల నమోదు, సవరణ కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి, ప్రకటించేందుకు తమకు వారం రోజుల సమయం పడుతున్నందున ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వారం రోజుల ముందువరకు అందిన అభ్యర్థనలను మాత్రమే పరిశీలిస్తామని, ఈ దరఖాస్తుదారులకూ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, ఎన్నికల విధుల నిర్వహణ కోసం నియమితులైన సిబ్బంది మొత్తం విధులకు హజరుకావాలని, గైర్హాజరయ్యే సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు!
జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి
జిహెచ్‌ఎంసి ఎన్నికల విధులకు నియమితులైన అధికారులంతా చిత్తశుద్ధితో హజరుకావాలని, గైర్హాజరైన వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయని జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం జరిగిన ప్రెసిడింగ్ అధికారులు, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి 2813 మంది గైర్హాజరైనట్లు గురించిన ఆయన దీనిపై సీరియస్‌గా స్పందించారు. మొత్తం 7వేల 51మంది ఈ శిక్షణకు హజరుకావల్సి ఉండగా, వీరిలో కేవలం 5వేల 252 మంది మాత్రమే హజరయ్యారని ఆయన వెల్లడించారు. గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయనున్నట్లు ఆయన తెలిపారు.