హైదరాబాద్

పొగాకు వినియోగం లేని సమాజ నిర్మాణం కోసం శ్రమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 31: పొగాకు వినియోగం లేని సమాజ నిర్మాణం కోసం అంతాకలిసి శ్రమిద్దామని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. వరల్డ్ నో టొబాకా డేను పురస్కరించుకొని మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫెడరేషన్ ఫర్ ఓరల్ క్యాన్సర్ (్ఫకా) సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొగాకుకు బానిసై ఆ వ్యసనాన్ని దూరం చేసేందుకు ఫోకా సంస్థ ఏర్పాటు కాల్ సెంటర్ ( 8099055550) సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు వందేళ్లు బతకమని అవకాశం ఇస్తే చెడు వ్యసనాల ద్వారా జీవిత కాలాన్ని తగ్గించుకోవడం ఆవేదన కలిగించే అంశమన్నారు. నోటిద్వారా పొట్టలో చెత్తాచెదారం వేసి అనంతరం రోగాల బారిన పడి ఇబ్బందుల పాలు కావడం విచారకరమన్నారు. పోగాకు వాడకం వల్ల జరిగే ప్రమాదం తెలిసి కూడా నానాటికీ వినియోగం పెరగడం ఎంతో బాధకలిగిస్తుందన్నారు. గతంలో లక్ష మందిలో ఒక్కరిలో కనిపించే క్యాన్సర్ వ్యాధి ప్రస్తుతం సర్వసాధారణ వ్యాధిగా మారడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఓరల్ క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరిన తరువాత వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోతోందని, ప్రారంభ దశలోనే గురిస్తే జీవితకాలాన్ని పెంచే అవకాశం ఉంటుందన్నారు. యుక్త వయస్సులో సరదాగా ప్రారంభమై, కర్కశంగా మృత్యువుకు చేరువు చేస్తున్న చెడు వ్యసనాలను వదిలి ఆనందంగా జీవించాలని సూచించారు. పొగాకు సేవించడం వల్ల వారికే కాకుండా ఇతరులకు ఎంతో ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. వ్యసనపరులను మార్చేందుకు వైద్యులు తమకు తాముగా బృందంగా ఏర్పడి అవగాహన కోసం తపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ బాల్‌రెడ్డి, నటుడు నందకిషోర్, రేడియోజాకీ శేఖర్, దంత వైద్య నిపుణుడు నాగేశ్వరరావు, ఫోకా అధ్యక్షుడు సునిల్‌తోపాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.