హైదరాబాద్

మెరుగైన సేవల దిశగా జిహెచ్‌ఎంసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, మే 31: జిహెచ్‌ఎంసి ప్రతిష్టాత్మంగా చేపట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో పలుకీలక నిర్ణయాలు తీసుకుంది. భవనాలు, లేఅవుట్ అనుమతులలో పారదర్శకత, అంకితభావం, చిత్తశుద్ధితో సిబ్బంది విధులు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ముఖ్యంగా జిహెచ్‌ఎంసి సిబ్బందికి, దరఖాస్తుదారులకు నేరుగా ఎలాంటి వ్యక్తిగత, పరిచయాలు, బాంధవ్యాలు లేకుండా ప్రక్రియ కొనసాగేలా దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే కొనసాగాలే చర్యలు చేపట్టింది. ఇందుకు తొలుత అన్ని గృహనిర్మాణాల అనుమతులు ఇక ఆన్‌లైన్ ద్వారానే సాగేలా కార్యాచరణ చేపట్టింది.
జూన్ 2నుంచి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసే విధానానికి మంగళం పాడింది. కొత్త నిబంధన జూన్ 2నుంచి ప్రారంభం కానుంది. నిర్ణీత సమయంలో దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ అప్రూవల్ ద్వారా పనులు పూర్తికానున్నాయి. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ‘డిపిఎంఎస్’ను పూణె చెందిన సాఫ్ట్‌టెక్ కన్సల్టెంట్ రూపొందించినట్టు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చెప్పారు.