హైదరాబాద్

అసెంబ్లీలో ఘనంగా వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం రాష్ట్ర అవతరణవేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్ మదుసూధనచారి సమక్షంలో అసెంబ్లీ ఉద్యోగులు బోనమెత్తుకున్నారు.ఈసందర్భంగా మహిళలకు ముగ్గులపోటీలు, వివిధ కళారూపాలను ప్రదర్శించారు.
అనంతరంజరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్ ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ పోరాటం నాటి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అసెంబ్లీలో తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల విభజన సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మదుసూధనచారి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఏర్పాటవుతుందని ముందుగానే గుర్తించిన కాలజ్ఞాని కెసిఆర్ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేశారని తెలిపారు.
బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జాతిని, తెలంగాణలోని పార్టీలను ఏకం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నీటికి, విద్యుత్‌కు, అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదనలను ఈ ప్రభుత్వం తోసిపుచ్చిందని, దేశం గర్వించేలా నిర్ణయాలు తీసుకుంటూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు.
కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ చెప్పినట్లు ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగుల మధ్య నెలకొన్న విభజన సమస్యను పరిష్కరిస్తామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి డా.ఎస్. రాజా సదారాం సభకు అధ్యక్షత వహించారు. మజ్లిస్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ జాఫ్రీ, ఏపి అసెంబ్లీ కార్యదర్శి కె. సత్యనారాయణరావు, అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ నర్సింహ్మాచారి, అసిస్టెంటు సెక్రటరీ ఉపేందర్‌రెడ్డి, చీఫ్ మార్షల్ కరుణాకర్, నవనిత్‌రావు తదితరులు పాల్గొన్నారు.