హైదరాబాద్

‘స్థారుూ’ ఎన్నిక ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: మహానగర పాలక సంస్థ అభివృద్ది పనులు, పౌరసేవల నిర్వహణతో పాటు పరిపాలన అంశాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేందుకు స్థారుూ సంఘం కూడా అందుబాటులోకి వచ్చింది. స్థారుూ సంఘం ఎన్నికకు సంబంధించి ఇదివరకే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 15మంది కార్పొరేటర్లను స్థారుూ సంఘం సభ్యులుగా ఎన్నుకోవల్సి ఉండగా, మజ్లిస్, టిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన మొత్తం 46 మంది కార్పొరేటర్లు నామినేషన్లు సమర్పించిన సంగతి తెలిసిందే! గురువారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడవు ముగుస్తుండటంతో ఆ రెండు పార్టీలకు చెందిన 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు గురువారం అధికారికంగా వెల్లడించారు. దీంతో బరిలో కేవలం పదిహేను మంది కార్పొరేటర్లు మాత్రమే అభ్యర్థులుగా బరిలో ఉండటంతో, ఇక పోలింగ్ లేకుండానే స్థారుూ సంఘం సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అయిదుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో అవగాహన పొత్తు పెట్టుకున్న మజ్లిస్ నుంచి ఒకే ఒక్క సభ్యుడిగా ఆ పార్టీ అవకాశమివ్వగా, స్థారుూ సంఘంలోని మొత్తం పదిహేను మందిని ఎన్నుకోవల్సి ఉండగా, ఆరుగురు మజ్లిస్ కార్పొరేటర్లకు అధికార టిఆర్‌ఎస్ పార్టీ స్థానం కల్పించింది. ఇందులోనూ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి ఆర్. గద్వాల్, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు వి. శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ మారి, మెహిదీపట్నం డివిజన్ నుంచి పోటీ చేసి బంగారిప్రకాశ్‌కు స్థానం కల్పించారు.
పోలింగ్ లేకుండానే ఏకగ్రీవంగా స్థారుూ సంఘానికి ఎన్నికైన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కవితారెడ్డి మనె్న, కందూరి నరేందర్, గొల్లు అంజయ్య, బంగారి ప్రకాశ్, రమావత్ పద్మ, విజయలక్ష్మి ఆర్ గద్వాల్, వి. శ్రీనివాస్‌రెడ్డి, కె. సాయిబాబా, టి.సునరితలున్నారు. మజ్లిస్ పార్టీ నుంచి అయేషా రుబీనా, ఎం.ఎ. గఫార్, మీర్జా ముస్త్ఫా బేగ్, షాహీన్‌బేగం, సయ్యద్ మినహాజుద్దిన్, సయ్యద్ సోహెల్ ఖాద్రి ఉన్నారు.