ఆటాపోటీ

హైదరాబాదీల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది భారత క్రీడా రంగంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించి,దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన ఘనత ఇద్దరు హైదరాబాదీలకు దక్కుతుంది. ఒకరు బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కాగా, మరొకరు టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా. వివిధ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారుల్లో సగానికిపైగా హైదరాబాదీలే కావడం విశేషం.
వారిలో సైనా అరుదైన మైలురాళ్లను చేరింది. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఫైనల్ చేరిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. టైటిల్ పోరులో ఓడినప్పటికీ, మొదటిసారి ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. మహిళల విభాగంలో మన దేశానికి ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం లభించడం అదే మొదటిసారి. పివి సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ తదితరులు అద్భుతాలు సృష్టిస్తారని అనుకున్నా, అభిమానులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. గాయాలు, ఫామ్ కోల్పోవడం వంటి సమస్యలతో భారత బాడ్మింటన్ అనుకున్న స్థాయిలో విజయాలను సాధించలేకపోయింది. అయితే, సైనా తర్వాత మెరుగైన ఆటతో రాణించిన ఆటగాడిగా శ్రీకాంత్ గుర్తింపు సంపాదించాడు. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన సైనా ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. అంతకు ముందు సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్‌ను గెల్చుకుంది. ప్రపంచ నంబర్ వన్ స్తానానికి చేరింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీల్లో ఫైనల్ చేరింది. దురదృష్టవశాత్తు ఈమూడు ఈవెంట్స్‌లోనూ ఆమెకు టైటిళ్లు లభించలేదు. కానీ, ప్రపంచ బాడ్మింటన్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నవంబర్‌లో కాలి మడమ గాయం కారణంగా హాంకాంగ్ ఓపెన్ నుంచి వైదొలగింది. బాడ్మింటన్ సూపర్ ఫైనల్స్‌లో ఆడుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, రెండో మ్యాచ్‌లోనే ప్రపంచ నంబర్ వన్ కరోలిన్ మారిన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. కానీ, ఫిట్నెస్ సమస్య తిరగబెట్టడంతో సెమీస్ చేరలేకపోయింది. జయాపజయాల విషయం ఎలావున్నా, ఆల్ ఇంగ్లాండ్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరడం, నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఈ ఏడాది సైనా సాధించిన అద్భుతాలు. పురుషుల విభాగంలో శ్రీకాంత్ మాత్రమే రాణించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం వరకూ చేరాడు. కానీ, హఠాత్తుగా ఫామ్‌ను కోల్పోయిన అతనికి టాప్-10లో స్థానం దక్కలేదు. కానీ, ఉజ్వల భవిష్యత్తు ఉన్న క్రీడాకారుడిగా ఈ హైదరాబాదీ ప్రశంసలు అందుకుంటున్నాడు.
===============
‘పద్మ’ వివాదం
క్రీడా రంగంలో ప్రతిష్ఠాత్మకమైన అర్జున, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను ఇప్పటికే అందుకున్న సైనా నెహ్వాల్ ఈఏడాది పద్మభూషణ్ దక్కుతుందని ఆశించింది. కానీ, తన పేరును ప్రతిపాదించకపోవడంతో, ఆగ్రహించి, అసమర్థులను అందలం ఎక్కిస్తున్నారంటూ ట్వీట్ చేసింది. తనకు ఎందుకు అవార్డు ఇవ్వరని నిలదీసింది. ఆమె వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం లేచింది. దీనితో పొరపాటును సరిదిద్దుకుంది. అవార్డుల కోసం తాను ఎన్నడూ ఆడలేదని, దేశానికి సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు సాధించిపెట్టడమే తన లక్ష్యమని పేర్కొంది. వివాదానికి తెరదించాలని కోరింది.