రాష్ట్రీయం

నాగరికతకు అనుగుణంగా మెలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఆల్వాల్, ఏప్రిల్ 15: ప్రపంచ దేశాలకు మన నాగరికతను తెలియజేసే విధంగా మనం మెలగాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ చైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సద్గురు శివానంద మూర్తి ఆశీస్సులతో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం సికిందరాబాద్ టివోలీ గార్డెన్స్‌లో శ్రీరామనవమి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భవానీ ప్రసాద్ వివిధ రంగాల్లో ఉత్తమమైన సేవలందించిన ఆరుగురు ప్రముఖులకు పురస్కారాలను అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్నతమైన స్థానముందని, దాన్ని కాపాడేందుకు అన్ని రంగాల వారు కృషి చేయాలన్నారు. ప్రధానంగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఎంతో ఉందని, ప్రతి వ్యక్తి మాతృభక్తితో నడవాలని, ఖండాంతరాలు దాటిన వారు కూడా దేశం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలను కనబర్చాలని కోరారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానించటం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. శివైక్యమైన సద్గురు శివానందమూర్తితో తనకు ఒక రోజు పరిచయం మాత్రమే ఉందని, ఏ లక్ష్యం లేకుండా ఉన్న తనకు లక్ష్య నిర్ధారణ చేసి సమాజానికి అంకితమయ్యే విధంగా స్ఫూర్తినిచ్చారని ఆయన వివరించారు. ఆయనిచ్చిన స్ఫూర్తితోనే శివ కుటుంబంలో సభ్యుడిగా కొనసాగుతున్నానని చెప్పారు.

పురస్కార గ్రహీతల స్పందన
మాతృ భాషను మర్చిపోతే మన ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు శ్రీరామన నవమి ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. హిందీ, ఇంగ్లీషు పదాలు లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. దీన్ని మనం మార్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-డా.సామల రమేష్ బాబు, జర్నలిస్టు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు..సద్గురు శివానందమూర్తి గురువుకు నేను రచించిన ‘క్షీరసాగరం’ పుస్తకాన్ని అందజేసి, విషయం చెప్పినపుడు ఆయన ఎంతో ఆనందపడి,నన్ను మెచ్చుకున్నారు., ఆ క్షణాన్ని నేనెన్నడూ మర్చిపోను. భారతీయత అనేది ఓ దేశభక్తి, దేశ సౌభాగ్యం కోసం అందరూ కృషి చేయాలని భోధించారు. నా రచనల్లో గురువు ప్రభావం ఎంతో ఉంది.
సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ, సినీ గేయరచయిత
గురువు ఆదేశం వల్ల నేను ఎంతో ప్రభావితమయ్యాను. ఆకాశవాణిలో పనిచేస్తున్నపుడు గురువుతో ఏర్పడ్డ సాన్నిహిత్యం వల్ల ఆయన భోధనలకు ఆకర్షితురాలినయ్యాను. దీంతో మరింత సేవ చేసేందుకు తోడ్పడింది. ఈ రోజు ఈ పురస్కారం అందుకోవటం గురువు ఆజ్ఞే.
వేదవతి ప్రభాకర్, లలిత సంగీత గాయని
నైతిక విలువలు, ధార్మిక విలువలు, రాజకీయ విలువలు, సాంస్కృతిక విలువలు ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుందని గురువు భోధించారు. దగా పడిన వారందర్నీ చేరదీయటం వల్లనే మంచి జరుగుతుందని చెప్పారు.
కసిరెడ్డి వెంకటరెడ్డి,
జానపద సాహిత్య రచయిత

భారతీయ సంస్కృతి మన బలం. జనభాష వారసత్వాన్ని కోల్పోతోంది. దాని ఉనికిని కాపాడుకునే బాధ్యత అన్ని రంగాల వ్యక్తులపై ఉంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనతో మెలగాలి. అన్ని పీఠాల వారు కూడా మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూ బోధనలు చేయాలి.
డా.మాడుగుల నాగఫణి శర్మ, సహస్రావధాని
సనాతన ధర్మ ట్రస్టు శ్రీరామ నవమి పురస్కారాన్ని స్వీకరించటం ఎంతో ఆనందంగా ఉంది.
రావినూతల శ్రీరాములు, బయోగ్రాఫర్