హైదరాబాద్

నగరానికి ‘బాహుబలి’ ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: మహానగర ప్రజలు ఎపుడెపుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి-2(ముగింపు) సినిమా శుక్రవారం నగరంలోని వివిధ ధియేటర్లలో విడుదల కానుంది. ఎప్పటి మాదిరిగా ప్రతిరోజు నాలుగు ప్రదర్శనలుండగా, బాహుబలి-2 యూనిట్ కోరిన విధంగా సర్కారు ఐదు షోలకు అనుమతిచ్చినా, కోంబో పద్దతిన బల్క్‌గా టికెట్ల అమ్మకానికిన సర్కారు అంగీకరించకపోవటంతో డిమాండ్ మరింత పెరిగింది. టికెట్ల కోసం జనం పైరవీలు చేయక తప్పటం లేదు. కొన్ని ఎంపిక చేసుకున్న ధియేటర్లలో సౌండ్ సిస్టమ్‌లోనే ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్న ప్రేక్షకులు కొందరు గడిచిన మూడు, నాలుగు రోజులుగా ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల ద్వారా టికెట్ల కోసం ఇక్కట్లు పడుతున్నారు. బాహుబలి-1 వచ్చిన రెండేళ్ల క్రితం నుంచి సినీ రంగంలో చర్చనీయాంశమైన బాహుబలి-2 విడుదలపై ఇంతకాలం నెలకొన్న సస్పెన్స్‌కు శుక్రవారం ఉదయంతో తెరపడనుంది. ఈ నెల 28వ తేదీ శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రాన్ని నగరంలోని అత్యధిక సంఖ్యలో ధియేటర్లలో విడుదల చేస్తున్నా, టికెట్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం బాహుబలి(ప్రారంభం)-1 సినిమా కన్నా రెండో పార్ట్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో నగరానికి బాహుబలి ఫీవర్ పట్టుకుందని చెప్పవచ్చు. నగరంలోని ప్రధాన ధియేటర్లు ప్రసాద్ హై మాక్స్, సినీ ప్లానెట్, ఏసిఎం, టివోలి, సినీ స్క్వేర్‌లతో పాటు నగరం, శివారు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసే వారికి శివారు ప్రాంతాల్లోని ధియేటర్లలో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు ఇప్పటికే టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. సినిమా విడుదలైతే పదిహేను వేల పై చిలుకు టికెట్ ధర పలికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పలువురు సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా కథానాయకుడు ప్రభాస్, రాణా అభిమాన సంఘాలు సినిమా విడుదల రోజు భారీగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ధియేటర్ల యాజమాన్యాలు, పంపిణీదారులు సినిమా విడుదల రోజు సెక్యూరిటీ నిమిత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికివారు సినిమా టికెట్ల కోసం రెండురోజుల నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏదేమైనా సినీ చరిత్రలో ఓ అరుదైన రికార్డు సృష్టించిన బాహుబలి-2 సినిమా ప్రేక్షకులకు బాహుబలి-1 అందించిన సక్సెస్‌ను అందిస్తుందో వేచి చూడాలి!