రాష్ట్రీయం

ఇన్‌క్యాప్ ఎండిగా ఆర్‌కె సుమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరబాద్, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఇన్‌క్యాప్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం ఆర్‌కె సుమన్‌ను నియమించింది. అక్కడ పనిచేస్తున్న కె సాంబశివరావును బదిలీ చేసి ఆయనను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. కాగా ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లకు కార్యదర్శి హోదా నుంచి ముఖ్య కార్యదర్శి హోదా కల్పించింది. ముఖ్యకార్యదర్శి హోదా పొందిన వారిలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా, సిఎం కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, పాఠశాల విద్య కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి ఎల్ ప్రేమ్‌చంద్రారెడ్డి ఉన్నారు. కాగా మరో ఉత్తర్వులో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా నియమించారు.