నమ్మండి! ఇది నిజం!!

ప్రపంచంలోనే ఎత్తయిన పోస్ట్ఫాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచం సువిశాలమైనది. ఇక్కడ ఎన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. అందరూ తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విశేషాలు బోలెడు ఉన్నాయి. అలాంటి ఆసక్తినే రెకెత్తిస్తుంది హిమాచల్‌ప్రదేశ్‌లోని కాజా సిటీకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిక్కిం పోస్ట్ఫాసు. హిక్కిం అనేది కొండపై కొలువై ఉన్న చిన్నపాటి గ్రామం. అయితేనేం ఇక్కడ చక్కటి పోస్ట్ఫాసు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోస్ట్ఫాసుగా రికార్డుకెక్కిన ఈ పోస్ట్ఫాసు 5 నవంబర్ 1985లో ప్రారంభమయింది. ఇది 15,500 అడుగుల ఎత్తులో నిర్మింపబడింది. రించెన్ చేరింగ్ అనే వ్యక్తి ఇక్కడ పోస్టు మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అతను గత ఇరవై తొమ్మిదేళ్లుగా ఇదే వృత్తిలో ఇక్కడే కొనసాగుతున్నాడు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వంటి ఎటువంటి ఆధునిక సదుపాయాలు లేని హిక్కిం గ్రామానికి ఈ పోస్ట్ఫాసే ఆధారం. నూట అరవై అయిదు కుటుంబాలకు సేవలందించే ఈ పోస్ట్ఫాసు సేవలను ఇక్కడి వారు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. రైతులు తమ ఆర్థిక లావాదేవీలు ఇక్కడి నుండే కొనసాగిస్తుంటారు. చక్కగా విధులు నిర్వర్తించే ఈ పోస్ట్ఫాసు కొన్ని అనుకోని కారణాల వల్ల ఏడాదిలో కొన్ని రోజులు మూతబడుతూ ఉంటుంది. ముఖ్యంగా శీతల ప్రదేశమైన హిమాచల్‌ప్రదేశ్‌లో విపరీతంగా కురిసే మంచు వల్ల ఈ పోస్ట్ఫాసు ఏడాదిలో కొన్ని రోజులు పని చేయడం మానేస్తుంది. హిమపాత ఉద్ధృతి తగ్గిన తర్వాత ఇది యథావిధిగా పని చేస్తుంది. హిమాచల్‌ప్రదేశ్, దాని చుట్టుపక్కల ఉండే బాబాలు, స్వాములు ఇతర ఆధ్యాత్మికవేత్తలు విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఈ పోస్ట్ఫాసు నుండే పాస్‌పోర్టులు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ పని చేసే ఇద్దరు ఉద్యోగులు ప్రతిరోజు ఉత్తరాలను పట్టుకుని కాజా సిటీకి కాలి నడకనే బయలుదేరుతారు. ఎందుకంటే ఎక్కడో కొండ కోనల్లో ఉండే హిక్కిం ప్రాంతానికి పెద్దగా ఎటువంటి రవాణా సదుపాయాలు లేవు. అలా హిక్కిం నుండి కాజాకి చేరుకున్న ఉత్తరాలు, ఇతర సమాచారానికి సంబంధించినవన్నీ కాజా నుండి కల్కా, సిమ్లా, ఢిల్లీ వంటి చోట్లకు రైళ్లు, విమానాల్లో తరలిపోతూ ఉంటాయి. కాజా నుండి హిక్కిం ఘాటీకి వెళ్లడానికి కేవలం ఒకే ఒక్క బస్సు ఉంటుంది. అది కూడా మధ్యాహ్నం రెండు గంటలకి ఒకే ఒక్క ట్రిప్పు ఉంటుంది. అక్కడికి వెళ్లి వచ్చాక ఆ బస్సు మళ్లీ మర్నాడే అక్కడికి వెళుతుంది. అందుకే టూరిస్టులు ఎత్తయిన, కొండలతో నిండి ఉండే అందమైన హిక్కిం సోయగాలు చూసేందుకు ప్రత్యేకంగా కార్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే హిక్కింలో విడిది చేసేందుకు ఎలాంటి గెస్ట్‌హౌస్‌లు గానీ, హోటళ్లు గానీ లేవు. అందుకే టూరిస్టులు ఎక్కువగా కాజాలోనే బస చేస్తారు.

- దుర్గాప్రసాద్ సర్కార్