అంతర్జాతీయం

బాబోయ్ బీ-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 7: చూడ్డానికి అదో మహా పర్వతం. గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక దాన్నుంచి బాంబుల వర్షం కురిసిందా భూమీద ఉన్న దేనిపైన అయినా పిడుగులు పడినట్టే. అమెరికా వైమానిక దళానికి చెందిన బీ 52 బాంబర్‌కు ఉన్న ప్రత్యేకతలు ఎన్నో.. గురితప్పకుండా శత్రువులను నిశే్సషం చేసే పటిమ దీనికి ఉంది. కేవలం 96 గంటల వ్యవధిలో 24 తాలిబన్ స్థావరాలను ఈ బాంబర్ నేలమట్టం చేసింది. బీ 52 ఆధునికమైనది కాకపోయినా ఇప్పటికీ అమెరికా వైమానిక దళంలో దాని పాత్ర కీలకమే. లక్షా 85వేల పౌండ్ల బరువుగల బీ 52 మొదటి సారిగా 1950వ దశకంలో అమెరికా వైమానిక దళంలోకి ప్రవేశించింది. అప్పట్లో అమెరికా-రష్యా మధ్య భీకర స్థాయిలో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులున్నాయి. దీర్ఘశ్రేణి లక్ష్యాలను అత్యంత ఎత్తునుంచి ధ్వంసం చేయగలిగే అవసరాలు తీర్చుకోడానికి ఈ బాంబర్‌ను తీసుకొచ్చినట్టు ఓ ప్రకటనలో అమెరికా తెలిపింది. అంతేకాదు అప్పట్లో సోవియట్ యూనియన్‌లోకి చొచ్చుకెళ్లి దాడిచేసే సామర్ధ్యం కూడా బీ 52కి ఉండటంతో దీని అవసరాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూనే వచ్చింది. ఈ బాంబర్ తదుపరి నమూనా బీ 52 1962లో వైమానిక దళంలో చేరింది. 159 అడుగుల పొడవైన ఈ యుద్ధ విమానం ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా సైన్యానికి నిరుపమాన సేవలు అందించింది. ఒక్కోదానిలో దాదాపు 70వేల పౌండ్ల బరువుగల బాంబులు, క్షిపణులు, మందుపాతరలను ప్రయోగించే అవకాశం ఉంది. తాజాగా అఫ్గాన్‌లో తాలిబన్ మిలిటెంట్లు గత వారం 100 మందిని మట్టుబెట్టిన నేపథ్యంలో ఈ మహా బాంబర్ రంగంలోకి దిగి 24 తాలిబన్ శిబిరాలను నేలమట్టం చేసింది.