అంతర్జాతీయం

పాక్ ఎగ్జిబిషన్‌లో ‘జలియన్‌వాలా బాగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఏప్రిల్ 21: భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అత్యంత హేయమైన ఘట్టంగా మిగిలిన జలియన్‌వాలా బాగ్ దురంతానికి సంబంధించిన అరుదైన పత్రాలను పాకిస్థాన్ తొలిసారిగా ప్రదర్శించింది. ఈ నరమేథం జరిగి వందేళ్ళు పూర్తయిన నేపథ్యంలో దాదాపు 70 చారిత్రక పత్రాలను ప్రదర్శిస్తున్నది. జలియన్‌వాలా బాగ్ ఘటన పీడ కలకు ఈ నెల 13వ తేదీతో వందేళ్ళు పూర్తయ్యాయి. లాహోర్‌లోని హెరిటేజ్ మ్యూజియంలో శనివారం నుంచి ఆరు రోజుల పాటు ఏర్పాటు చేసిన జలియన్‌వాలా బాగ్ ప్రదర్శనలో 70 చారిత్రక డాక్యుమెంట్లను ప్రదర్శించింది. ఏడాది క్రితం కూడా విప్లవ నాయకుడు భగత్ సింగ్ చరిత్రను తెలిపే ప్రదర్శనలో లాహోర్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇక జలియన్‌వాలా బాగ్ ఉదంతం విషయానికి వస్తే 1919 సంవత్సరం ఏప్రిల్ 13న బైసాఖి పండుగ నేపథ్యంలో పంజాబ్, అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో వేలాది మంది చేరుకున్నారు. ఆ సమయంలో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ కమాండ్ కల్నల్ రీజినాల్డ్ డయ్యర్ సారథ్యంలో ఆర్మీ దళాలు అక్కడికి చేరుకున్నాయి. డయ్యర్ ఆదేశంతో ఆర్మీ దళాలు కాల్పులు జరపడంతో 241 మంది నేలకొరిగారు. ఇంకా వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన నాటి స్వాతంత్య్రోదమకారుల్లో మరింత పట్టుదల పెరిగింది.