అంతర్జాతీయం

అశోకుడే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 16: అన్ని విధాలా చిన్నా భిన్నం అవుతున్న వర్తమాన సమాజానికి రెండు వేల సంవత్సరాల క్రితం నాటి భారత చక్రవర్తి అశోకుడు ప్రవచించిన సామరస్య భావనలే ఆదర్శమని ఐక్య రాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్ అన్నారు. వర్తమాన సంక్లిష్ట సమాజంలో అసహనం పెరిగిపోతోందని పేర్కొన్న ఆమె అశోకుడి సామరస్య సంబంధాల ప్రవచనాలను ఉటంకించారు. మైనారిటీలు, శరణార్ధులపై దాడులు పెచ్చరిల్లుతున్నాయని, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకొని మట్టుబెడుతున్న నేటి సమాజంలో సమీకృత సామాజిక జీవనం, వైవిధ్యం ఎంతో అవసరమని ఆమె ఉద్ఘాటించారు. కులాలు, మతాలు, జాతులతో సంబంధం లేకుండా ప్రజలందరి మధ్య సత్సంబంధాలు పెరగాల్సిన అవసరంపై వేలాది సంవత్సరాలుగా మేధావులు, తత్త్వవేత్తలు చర్చిస్తూనే ఉన్నారని పేర్కొన్న ఆమె ‘ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉండాలి. మత పరంగానూ ఇతరత్రా ఇవి పరిఢవిల్లాలి. పరస్పర మత గ్రంథాలను గౌరవించుకోవాలి’ అంటూ రెండు వేల సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి ప్రవచించిన విషయాన్ని గుర్తుచేశారు. బహుళ సమాజా స్థాపనపై లిస్బన్‌లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ఆమె సామరస్య పునాదులపై బహుళ సమాజ స్థాపన లక్ష్యాన్ని అమలు చేసే దిశగా ప్రపంచ దేశాలు నడుం బిగించాలన్నారు. అనేక దేశాల్లో అసహనం, వివక్ష పెరిగిపోతున్నాయంటూ ఆందోళ వ్యక్తం చేసిన ఆమె న్యూజిలాండ్‌లో మసీదులపై, శ్రీలంకలో చర్చిలపై, అమెరికాలో పార్శీల మత ప్రదేశాలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. ఈ దాడులకు ప్రధాన కారణం పరస్పర మతాలను గౌరవించుకోకపోవడమేనని తెలిపారు. అలాగే రోజువారీగా జరుగుతున్న దాడుల ఫలితంగా మానవ హక్కులు హరించుకు పోతున్నాయని, మహిళలు, బాలికలను భద్రతే లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై ఈ రకమైన దాడులు చేయడం వల్ల ప్రపంచ జనాభాలో సగ భాగంగా ఉన్న ‘మన తల్లులు, కుమార్తెలు, అక్కలూ చెల్లెల్ల భవితే దెబ్బతింటుంది’ అని హెచ్చరించారు. మానవ విలువలే పునాదిగా ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలను పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పునరుద్ఘాటించారు. అమానుషత్వం, విలువల దిగజారుడుతనం గురించి మనల్ని, మన వ్యవస్థలను కాపాడుకోవాలంటే ఆదర్శనీయమైన రీతిలో బహుళ సమాజ స్థాపనకు ఉద్విక్తం కావాలని పిలుపునిచ్చారు. 2030 నాటికి ఐరాస నిర్దేశించిన అభివృద్ధి అజెండాను ఆచరణయోగ్యం చేసుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కదలి రావాలని అమీనా మహమ్మద్ అన్నారు.