ఆంధ్రప్రదేశ్‌

ఇసుక టెండర్లకు వ్యాట్ రిజిస్ట్రేషన్ అడ్డంకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 23: ఇసుక రీచ్‌ల వేలంలో పాల్గొనేందుకు వ్యాట్ రిజిస్ట్రేషన్ అడ్డంకిగా మారింది. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక వేలం విధానంలో వ్యాట్ రిజిస్ట్రేషన్ లేకుండా టెండర్లు దాఖలుచేయటానికి కుదరదు. వ్యాట్ రిజిస్ట్రేషన్ ద్వారా లభించిన టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్(టిన్ నంబర్) లేకుండా ఇసుక రీచ్‌ల వేలంలో పాల్గొనేందుకు సాధ్యంకాదు. అందులోనూ ఈసారి ఇ వేలం, ఇ టెండరు విధానంలో ఇసుక వేలం నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఈ విధానంలో వేలంలో పాల్గొనాలని భావించిన వారు విధిగా వాణిజ్య పన్నులశాఖ వద్ద వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని, టిన్ నంబర్‌ను పొందాల్సి ఉంటుంది. ఇ వేలం, ఇ టెండరు విధానంలో వేలంలో పాల్గొనాల్సి ఉండటంతో టిన్ నంబర్ లేకుండా అసలు ఇ వేలం, ఇ టెండరు ప్రక్రియలో అంగుళం కూడా దరఖాస్తును కదపలేని పరిస్థితి ఉంటుంది. ఇ వేలం, ఇ టెండరు ప్రక్రియను మెటల్ స్క్రాబ్ ట్రేడ్ కార్పొరేషన్(ఎంఎస్‌టిసి)కు రాష్ట్రప్రభుత్వం అప్పగించటంతో, ఎంఎస్‌టిసిలో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కూడా టిన్ ఉండాలి. ఎంఎస్‌టిసిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతే వేలంలో పాల్గొనదలచిన వారి దరఖాస్తు ఆన్‌లైన్‌లో ముందుకు కదులుతుంది. ఇసుక వేలంలో పాల్గొనాలంటే ఇలాంటి కీలక నిబంధనను పాటించాలని నిర్ధేశించిన రాష్ట్రప్రభుత్వం, తీరా ఔత్సాహికులు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెళితే వాణిజ్యపన్నుల శాఖ అధికారులు రిజిస్ట్రేషన్లు చేయటం లేదని చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో మిగిలిన కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నపుడు, కేవలం వ్యాట్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఎందుకు చేయటం లేదో అర్ధంకావటం లేదని ఔత్సాహికులు చెబుతున్నారు.