రాష్ట్రీయం

ఇంటెలిజెన్స్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: పోలీసు శాఖలోని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, సిఐడి విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మూల వేతనంపై 25శాతం స్పెషల్ అలవెన్స్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. శుక్రవారం సిఎం క్యాంపు కార్యాలయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి నేతృత్వంలో అధికారులు సిఎంను కలిశారు. స్పెషల్ అలవెన్స్ ప్రకటించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ప్రత్యేక విధులు నిర్వహించే వారికి అదనపు అలవెన్స్ ఇవ్వడాన్ని బాధ్యతగా భావించినట్టు చెప్పారు. దీంతో ఇంటెలిజెన్స్‌లో 464, సెక్యూరిటీ విభాగంలో 893, సిఐడిలో 646 మంది ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలపై వివిధ శాఖలను సమన్వయం చేస్తున్న సిఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగంగా జరగాలని సిఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రులకు అదనంగా మరో రెండు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని సిఎం నిర్ణయించారు. వీటి నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలందించే విధంగా పరికరాలు సమకూర్చాలని సిఎం ఆదేశించారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అన్ని శాఖల మంత్రులు, అధికారులతో అంతర్గత సమావేశాలు నిర్వహించుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. మూస పద్ధతిలో కాకుండా అవసరమైన పనులకు బడ్జెట్ కేటాయింపులు జరిగేలా ప్రతిపాదనలుండాలని, నిరర్ధక వ్యయాన్ని బాగా తగ్గించేందుకు శాఖల వారీగా సిఫారసులు కూడా రూపొందించాలని సిఎం కెసిఆర్ చెప్పారు.