బిజినెస్

2015లో 1,550 ఐఎపిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష మంది పెట్టుబడిదారులకు లబ్ధి
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి (ఎన్‌ఎస్‌ఇ) 2015లో పెట్టుబడిదారుల కోసం దాదాపు 1,550 అవగాహనా కార్యక్రమాలను (ఐఎపిలను) నిర్వహించించింది. పెట్టుబడిదారుల కోసం 2014లో 1,138 చైతన్య కార్యక్రమాలను నిర్వహించిన ఎన్‌ఎస్‌ఇ ఈసారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి లక్ష మందికిపైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది. 2014లో పెట్టుబడిదారుల కోసం నిర్వహించిన చైతన్య కార్యక్రమాల్లో దాదాపు 80 వేల మంది పాల్గొనగా 2015లో వీరి సంఖ్య 25 శాతం పెరిగి లక్ష దాటిందని ఎన్‌ఎస్‌ఇ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘పెట్టుబడిదారుల్లో అవగాహన పెంపొందించేందుకు 2014లో మొత్తం 1,138 కార్యక్రమాలు నిర్వహించగా 2015లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగి దాదాపు 1,550కి చేరుకుంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐఎపిలను నిర్వహించి పెట్టుబడిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేపట్టవలసిన చర్యల గురించి మార్గనిర్ధేశం చేశాం’ అని ఎన్‌ఎస్‌ఇ ఆ ప్రకటనలో పేర్కొంది.