అంతర్జాతీయం

అమెరికాలో ముస్లిం ఇమామ్, అనుచరుడి కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 14: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం ఇమామ్‌ను, అతని అనుచరుడ్ని పట్టపగలే కాల్చి చంపడం సంచలనం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం ఫుర్కాన్ జామే మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తున్న బంగ్లాదేశీ అమెరికన్ ఇమామ్ వౌలానా ఆక్నోజి, అతని సహాయకుడు 64 ఏళ్ల తారా ఉద్దీన్‌లను నల్లటి పోలో దుస్తులు ధరించిన ఒక యువకుడు వెనుకవైపునుంచి వచ్చి వారిపై అతి దగ్గరనుంచి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వెంటనే అదే వ్యక్తి తుపాకీతో పారిపోవడం, సిసి నిఘా కెమెరాల్లో కనిపించింది.
ప్రత్యక్ష సాక్షులు సైతం అదే విషయాన్ని ధ్రువీకరించారు. కాల్పుల్లో తూటా తలలోంచి దూసుకెళ్లడంతో అకోంజీ అక్కడికక్కడే అపాణాలు విడవగా, తీవ్రంగా గాయపడిన ఉద్దిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో స్థానిక ముస్లింలు తమకు న్యాయం జరగాలంటూ నిరసనలు తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ఫలితంగానే ఈ దారుణం చోటు చేసుకుందని వారు ఆరోపించారు.