బిజినెస్

ఐసిఎఐ అధ్యక్షుడిగా దేవరాజారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారత ఛార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ఐసిఎఐ)కి నూతన అధ్యక్షుడిగా ఎం దేవరాజారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016- 17)కుగాను ఆయన ఈ పదవీలో కోనసాగనున్నారు. గడచిన 64 ఏళ్లలో ఐసిఎఐకి ఒక తెలుగు వ్యక్తి అధ్యక్షుడు కావడం ఇదే ప్రథమం. తిరుపతికి చేందిన దేవరాజారెడ్డి గత 28 ఏళ్లుగా ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా సేవలందిస్తున్నారు. కాగా, దేవరాజరెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ చార్టర్డ్ అకౌంటెంట్స్ విద్యకు సంబంధించిన సిలబస్‌లో మార్పులు, చేర్పులు అవసరమన్నారు. అలాగే ఎక్కువ ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉండేలా ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 30 వేల కుపైగా ఛార్టర్డ్ అకౌంటెంట్లుగా పని చేస్తున్న నేపథ్యంలో ఆయా దేశలకు తగినట్లుగా సిలబస్ విషయంలో జాగ్రత్తలు తిసుకొన్నట్లు చెప్పారు. దేవరాజారెడ్డితోపాటు ఉపాధ్యక్షుడిగా నిలేష్ వికంసే ఎంపికయ్యారు.