జాతీయ వార్తలు

ఐసిస్ కొత్త నాయకునిపై ట్రంప్ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఐసిస్ చీఫ్ బగ్దాదీని అమెరికా సైన్యం రహస్య ఆపరేషన్‌లో మట్టుబెట్టింది. దీన్ని ఐసిస్ సంస్థ ధృవీకరించింది. కొత్త నేతగా అబు ఇబ్రహీం అల్ హషిమీ ఆల్ ఖురేషిని ప్రకటించింది. ఈ మేరకు ఆడియో క్లిప్పింగ్‌ను సైతం విడుదల చేసింది. బగ్దాదీని అంతమొందించిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా హెచ్చరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ఐసిస్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు. అతని గురించి తమకు తెలుసు అని పేర్కొన్నారు. కాగా అమెరికా సైన్యం సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో జరిపిన సీక్రెట్ సైనిక ఆపరేషన్‌లో బగ్దాదీ అనుచరుడు అబు హసన్ అలీ ముజాహిర్ కూడా హతమయ్యాడు.