ఐడియా

చిటికెలో తాజాగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీకెళ్లాలి. చిటికెలో తాజాగా అరవిరిసిన గులాబీ వలే కనబడాలంటే ఎలా అని ఆందోళన చెందనక్కర్లేదు. ఇలాంటప్పుడు బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలుపుకోవాలి. దానికి చెంచా తేనె, చెంచా గంధం పొడి, చెంచా ముల్తానీ మట్టి జతచేసి అవసరాన్ని బట్టి పాలతో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుంటే చర్మం కాంతిమంతంగా కనపిస్తోంది.
దుమ్మూధూళీ చర్మంపై పేరుకున్నప్పుడు మృతకణాల సమస్య ఎక్కువవుతుంది. అవి చర్మాన్ని బరకగా, మురికిగా మార్చేస్తాయి. ఇవి తొలగించుకునేందుకు అరకప్పు బొప్పాయి గుజ్జులో గుప్పెడు పంచదారను కలిపి, దాంతో మృధువుగా చర్మంపై రుద్దితే సరిపోతుంది. మృతకణాలు తొలగిపోతాయి.
బొప్పాయిని క్లెన్సర్‌లా కూడా వాడుకోవచ్చు. అరకప్పు బొప్పాయి గుజ్జులో అరచెక్క నిమ్మరసం పిండి, ఆ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసుకోవాలి. పది నిమిషాలు ఆరాక, శుభ్రం చేస్తే చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది.
***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03