ఐడియా

చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది పొడవునా లభించే పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేద వైద్యంలో పుదీనా మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలర్జీ, ఉబ్బసానికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. వంటల్లోనే కాదు, ‘టీ’లో కూడా పుదీనా ఆకులను విరివిగా వాడుతుంటారు. పుదీనా ఆకులతో చేసే పచ్చడి రుచికరంగానే కాదు, ఆరోగ్యరీత్యా మనకు మేలు చేస్తుంది. పుదీనాను ఆహార పదార్థాలలో వాడడం వల్ల శ్వాస సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మన నోటిలోని హానికారక బాక్టీరియాను పుదీనా నశింపజేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు అలర్జీలను తగ్గిస్తాయి. తేమ వాతావరణం ఉన్నపుడు వేడినీళ్లలో లేత పుదీనా ఆకులను వేసి ఆవిరి పడితే జలుబు, గొంతునొప్పి దూరం అవుతాయి. పుదీనా ఆకులు వేసి ‘టీ’తాగితే జీర్ణసంబంధ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీనిలోని విటమిన్ సీ,డీ,బీ లతో పాటు కాల్షియం, పాస్ఫరస్ వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దురదలు, మచ్చలు, దద్దుర్లు వంటివి తొలగిపోవాలంటే పుదీనా ఆకులను నలిపి చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మెత్తటి ఉప్పు కలిపిన పుదీనా కషాయాన్ని పుక్కిలిస్తే గొంతు నొప్పి, దగ్గు వంటివి తగ్గుతాయి.