ఐడియా

మెగ్నీషియం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజువారీ ఆహారంలో తగినన్ని ఖనిజాలు ఉన్నాయా? లేవా? అని చూసుకుంటాం కానీ మెగ్నీషియం గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. శరీరం సక్రమంగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. కండరాలు, నరాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే మెగ్నీషియం తప్పనిసరి. రోగనిరోధక వ్యవస్థకు సాయపడుతుంది. ఆరోగ్యకరమైన గుండెను అలాగే కాపాడుకోవడానికి, ఎముకలను దృఢంగా ఉంచుకోవడానికి కూడా మెగ్నీషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏడాది నుంచి మూడేళ్ల వయస్సువరకు 65 మిల్లీగ్రాముల మెగ్నీషియం ప్రతిరోజూ అవసరం. నాలుగు నుంచి ఎనిమిదేళ్ల పిల్లలకు 10 మిల్లీగ్రాములు, తొమ్మిదేళ్ళు పైబడినవారందరికీ 350 మిల్లీగ్రాములు కావాలి. కాబట్టి మెగ్నీషియం అధికంగా లభించే ఆహారపదార్థాలు తింటుండాలి. మరీ అవసరమైతే ఓరల్ మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాలి.
పాలకూర
ఆరోగ్యవంతమైన తక్కువ కేలరీలు కలిగిన సూపర్ ఫుడ్ పాలకూర. కప్పు పాలకూరలో నూట యాభై మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.
గుమ్మడి గింజలు
పోషకాలకు పవర్‌హౌస్‌గా గుమ్మడి గింజలను చెప్పొచ్చు. ఈ గింజల్లో అత్యధిక మెగ్నీషియం ఉంటుంది. శరీరానికి అవసరం అయ్యే ఏడు అత్యవసర మాక్రో వినరల్స్‌లో ఒకదాన్ని కలిగి ఉంటాయి.
పెరుగు
కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే పెరుగును తీసుకుంటే ఎముకలకు ఆరోగ్యం చేకూరుతుంది.
బాదం
దైనందిన ఆహారంలో బాదం పప్పులను తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాట్ శాతం ఎక్కువ ఉన్నప్పటికీ, బాదం పప్పుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బ్లాక్‌బీన్స్
ఐరన్, మెగ్నీషియంలకు ఇవి అద్భుత ఆధారాలు. వీటిలో ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ ‘బి’ కూడా పుష్కలంగా ఉంటాయి.
అవకాడొ
డైలీ డైట్‌లో కొన్ని అవకాడోలను భాగం చేసుకుంటే లభించే ఆరోగ్య ప్రయోజనాలు అనంతం.
ఫిగ్స్
అత్యవసర పోషకాలను తీసుకోవడానికిగాను అప్పుడప్పుడూ ఫిగ్స్‌ను తింటుంటే అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
డార్క్ చాక్లెట్
వీటివల్ల గుండె, మెదడు, బ్లడ్‌షుగర్‌ల నుంచి పరిరక్షించుకోవడం మాత్రమే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు, మెగ్నీషియంతో సహా ఇతర ఖనిజాలు లభిస్తాయి.
అరటిపండు
శక్తిని ఇచ్చే స్నాక్ అరటిపండు. ఒక్క అరటిపండు తింటే 32 మిల్లీగ్రాముల మెగ్నీషియంతోపాటు పొటాషియం, విటమిన్ సి, పీచు లభిస్తాయి.
నువ్వులు
చూడడానికి చిన్నగా ఉన్నా పెద్ద ప్రయోజనాలుంటాయి. ఒత్తిడిని తగ్గించే ఖనిజాలు మెగ్నీషియం, కాల్షియంలతో సహా లభిస్తాయి.
పొద్దుతిరుగుడు గింజలు
అరకప్పు పొద్దుతిరుగుడు గింజల్లో రోజుకు కావాల్సిన మెగ్నీషియంలో ఇరవై శాతం లభిస్తుంది.
టోఫు
ఈ శాకాహార సోయా ప్రొటీన్‌లో మెగ్నీషియం, కాపర్, జింక్, విటమిన్ బి1 లభిస్తాయి.
అవిసె గింజలు
ఒక్క టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో రోజుకు అవసరమైన మెగ్నీషియం మోతాదులో పదిశాతం వరకు లభిస్తుంది.
ఓట్‌మీల్
ఇది కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును తగ్గించడమే కాకుండా పీచుశాతం వల్ల మరిని ప్రయోజనాలను అందించగలదు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. ముప్పావు కప్పు ఓట్‌మీల్‌లో 47 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.