ఐడియా

కాటుక పెట్టుకుంటున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. ఎంత చిన్న కళ్లు అయినా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. మంగళ ద్రవ్యమైన కాటుక ధారణ సుమంగళత్వాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదమూ చెబుతోంది. అయితే కాటుక వినియోగం నేడు తగ్గిపోయింది. చాలామంది కాటుక స్థానంలో ఐ లైనర్, మస్కారాలను వినియోగిస్తున్నారు. ఇవి కూడా ముఖానికి అందాన్నిస్తాయి. కానీ ఆరోగ్యానికి కాదు. కాటుక కంటికి అందాన్ని, ఆరోగ్యాన్నీ ఇస్తుంది. అయితే కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి.
* కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్లపై తడి లేకుండా తుడుచుకోవాలి.
* కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. లేదా కొద్దిగా పౌడర్ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై జిడ్డుని పౌడర్ పీల్చుకుని కళ్లు తాజాగా ఉంటాయి.
* కనురెప్పల కొనభాగంలో కాటుక పెట్టుకొంటే చెరిగిపోయే అవకాశం ఎక్కువ కనుక కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి.
* కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్ కలర్ ఐషాడో బేస్‌గా వేసుకున్నా కాటుక ఎక్కువసేపు చెదిరిపోకుండా చూసుకోవచ్చు.
* కళ్లకి ఎప్పుడూ నాణ్యమైన కాటుకనే వాడాలి. కాటుక వాడినప్పుడు దురద పెట్టడం, కళ్లు మంటపుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ కాటుక పెట్టుకోవడం ఆపేయాలి.
* ఎక్కువగా చెమట పోసే చర్మం ఉన్నవారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కూడా కాటుక పెట్టుకోవాలని అనుకునేవారు.. ముందుగా ముఖాన్ని ఐస్ ముక్కలతో మర్దనా చేసుకోవాలి. దీనివల్ల చెమట ఎక్కువ పట్టదు. ఇప్పుడు కాటుక పెట్టుకున్నా చెదరకుండా అందంగా ఉంటుంది. *