ఐడియా

అర్ధరాత్రి తింటే ముప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారిన జీవనశైలి వల్ల రాత్రిపూట చాలా ఆలస్యంగా తినడం పరిపాటైపోయింది. పోషకాహార నిపుణులు, వైద్యులు చెప్పేదాని ప్రకారం నిద్రపోయే ముందు రెండు గంటల గ్యాప్‌తో ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు ఆహారం తింటే.. అంటే తిన్న వెంటనే నిద్రపోతే.. అదీ ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు కొవ్వు పదార్థాలు కూడా పెరిగి గుండె సమస్యలు వస్తాయి. వీటితో పాటు మెదడుపై అర్ధరాత్రి తిన్న ఆహారం అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది. పెద్దపెద్ద నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన ఆహారం, స్నాక్స్ తింటుంటారు. టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో సినిమాలు చూస్తూ, నెట్‌లో ఊసుపోని కబుర్లు చెప్పుకుంటూ చిరుతిళ్లు తమకు తెలీకుండానే లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్ళు, జంక్‌ఫుడ్ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవల ఒక పరిశోధన వెల్లడైంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్తవ్రేత్తలు కొనే్నళ్లపాటు అర్ధరాత్రి జంక్‌ఫుడ్ తినేవారిని జాగ్రత్తగా పరిశీలించారు. వారి వివరాలను పొందుపరిచారు. పడుకునే ముందు జంక్‌ఫుడ్, స్నాక్స్ తినేవారిలో మెదడు తీవ్రప్రభావానికి గురైందని వారు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది.