ఐడియా

పోషకాలను పెంచే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజా కూరగాయల్లో ఎన్నో విలువైన పోషకాలుంటాయి. వాటి ని ఆరగించడానికి పసందైన రుచులలో వండుకుంటాం. వండ డం వలన ఆహార పదార్ధాలకు రుచి, సువాసన కలుగుతాయి. అలాగే కంటికి ఇంపుగా కనపడతాయి. జీర్ణం చేసుకోవడం తేలిక అవుతుంది. కూరగాయలను వండడంలో జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని మెళకువలను పాటిస్తే రుచి, సువాసనతో పాటు పోషక విలువలు కలిగి వుంటాయి.
కూరగాయలు కడగడం, తరగడం, ఉడకపెట్టడంలో సరైన అవగాహన లేక ఎన్నో పోషకాలను నష్టపోతున్నాం. ఆహారపదార్ధాలను ఉడకపెట్టినా, వేపుడు చేసినా అతిగా చేస్తే పోషక విలువలు పూర్తి గా నశిస్తయి. తాజా కూరగాయల్లో పోషకాలు ఆధికంగా వుంటాయి. కూరగాయలను తగు మోతాదు లో నీటిలో మాత్రమే ఉడకపెట్టాలి. ఎక్కువగా ఉడికించకూడదు. వేపుడు చేయడంవల్ల పరదార్ధాల రుచి పెరుగుతుంది కానీ పోషకాలను ఎక్కువగా నష్టపోతాము.కొద్ది నూనెలో మితంగానే వేపుడు చేసుకోవాలి. బాగా రోస్ట్ చేస్తే చాలామాటుకు పోషకాలు మాయమవుతాయి. ఆహారాన్ని ఏ పద్ధతిలో తయారుచేసినా తగు జాగ్రత్తతో పాటుగా కొన్నిచిట్కాలు తెలుసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఆహార పదార్ధాల్లోని పోషకాలు, విటమిన్లు అన్నీ మన సొంతమవుతాయి.
అన్నం వండేటప్పుడుగంజి వార్చకుండా అత్తెసరుగా వండాలి. అంటే ఒకటి, రెండు నిష్పత్తిలో బియ్యం, నీరు పోసి ఉడికించాలి.
ఇడ్లీ,వడ, అట్లు, దోసెలు, కిచిడీ తయారీలో పోట్టు పప్పులను వినియోగించాలి.
పప్పు ధాన్యాం ఏదైనా ఒకేరకం రోజు వాడడం కన్నా రెండు మూడు రకాలుగా వాడితే మేలు.
ఆవిరితో ఉడికించిన ఆహార పదార్ధాలు ఎక్కువ గా పోషకాలను నష్టపోవడమేకాకుండా సులభంగా జీర్ణమవుతాయి కూడా. పప్పులు, కూరలు ఉడికిన తరువాత మిగిలిపోయిన నీటిని పారపోయకుండా చారులోగానీ, పులుసులో కానీ వాడుకోవాలి.

- హర్షిత