ఐడియా

జంక్ ఫుడ్‌తో జంకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వాటిలో జంక్‌ఫుడ్ మార్కెట్‌దే మొదటిస్థానం. ఏటా 20 శాతం చొప్పున అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బిజినెస్‌లో లక్ష కోట్లు జరుగుతోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ బిజినెస్ మరింత విస్తరిస్తూ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా.. ఫాస్ట్ఫుడ్ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. జంక్‌ఫుడ్ కంపెనీలు కొన్ని పది నుంచి ఇరవై సంవత్సరాల వయస్సు గ్రూపులను టార్గెట్ చేసుకుంటూ బిజినెస్ వ్యూహాలు రూపొందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా జంక్‌ఫుడ్స్ వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రముఖ పానీయ కంపెనీ 500 కోట్ల డాలర్లు అంటే 30 నుంచి 35 వేల కోట్ల రూపాయల దాకా గుమ్మరించేందుకు సిద్ధమైంది.
జంక్‌ఫుడ్ మార్కెట్ విస్తరించడం శుభపరిణామం కాదు. అది రాబోయే అనారోగ్య సమాజానికి హెచ్చరిక. జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి హానికరం. మత్తు, మాదకద్రవ్యాలు, సిగరెట్లు ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్లే జంక్‌ఫుడ్ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మధుమేహం, గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు కూడా ఈ జంక్‌ఫుడ్ కారణమవుతోంది. దీని కారణంగా తలెత్తే ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయించుకోవడానికి భారతదేశం జాతీయాదాయంలో ఏటా దాదాపు రెండు వేల కోట్లకు పైగా నష్టపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. రోజురోజుకీ విస్తరిస్తున్న జంక్‌ఫుడ్ కల్చర్ ఆరోగ్యానే్న కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది.
ఫాస్ట్ఫుడ్ కంపెనీల ప్రచారానికి ప్రధానంగా స్కూల్, కాలేజీ పిల్లలే.. వీటికి అలవాటుపడ్డ పిల్లల్లో ఊబకాయం, బీపీ, షుగర్, మతిమరుపువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల ఆరోగ్యంపై వీటి ష్ప్రభావాన్ని గుర్తించిన కొన్ని దేశాలు స్కూళ్లలో వీటి అమ్మకాలను, టీవీలలో అడ్వర్టయిజ్‌మెంట్లను నిషేధించాయి. చిప్స్, కుకీస్, క్యాండీ, కార్బోనేటెడ్సోడాలను స్కూల్స్‌లో విక్రయించకూడదని కోస్టారికా ఆంక్షలు విధించింది. స్కూల్ పిల్లలకు షుగరీ సోడాలు, ప్రాసెస్డ్ స్నాక్స్ మొదలైనవి విక్రయించకూడదని మెక్సికో ఆదేశించింది. టాకోస్, బర్కిటోస్, సలాడ్స్ వంటి వాటిల్లో కొవ్వు తక్కువగా ఉండాలని నిబంధనలు విధించింది. పాఠశాల దగ్గర ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను మాత్రమే విక్రయించాలని పెరూ చట్టం చేసింది.
మనదేశంలోనూ స్కూళ్ల కేంటీన్లలో జంక్‌ఫుడ్స్ అమ్మకూడదన్న నిబంధలున్నప్పటికీ అవి అమలుకావడం లేదు. కొన్ని స్కూల్స్ నిర్వహించే కార్యక్రమాలకు బడా సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తూ తమ అమ్మకాలు పెంచుకుంటున్నాయి. మనదేశంలో ఫాస్ట్ఫుడ్ ఉత్పత్తి, అమ్మకాలు, ప్రచారాన్ని నియంత్రించే చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం జంక్‌ఫుడ్స్ వాడకాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టడం సంతోషకర పరిణామం. జంక్‌ఫుడ్స్‌పై ఫ్యాట్ పన్ను విధించడం వల్ల కేరళ ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినప్పటికీ కనీసం అల్పాదాయ వర్గాలవారైనా జంక్‌ఫుడ్ జోలికి వెళ్లరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫాస్ట్ఫుడ్స్ వాడకం నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాల సిఫార్సులు చేసింది. పండ్లు, కూరగాయల ధరలు తగ్గేలా, ఫాస్ట్ఫుడ్ ధరలు పెరిగే పన్నులుండాలన్నది వీటిలో ఒకటి. పండ్లు, కూరగాయల సాగుకు సబ్సిడీలిచ్చి వాటిని ప్రోత్సహించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల్లో మొదటిది. ఫాస్ట్ఫుడ్ కూల్‌డ్రింక్స్ ప్రచారాన్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలన్నది రెండో అతి ముఖ్య సూచన. ఆహార ఉత్పత్తుల పాకెట్లు, డబ్బాలపై మరింత స్పష్టమైన, సమగ్రమైన సమాచారంతో కూడిన లేబుల్స్ ఉండాలన్నది మూడో సూచన. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే స్లోగన్ సిగరెట్ పాకెట్లపై ముద్రించినట్లే, ఫాస్ట్ఫుడ్ పాకెట్స్‌పై కూడా ఇలాంటి హెచ్చరిక ముద్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.