ఐడియా

ఆరోగ్య లవంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మని వాసన, రుచిని అందించే లవంగంలో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. మసాలా, మాంసాహార వంటకాల్లో విరివిగా వాడే లవంగం వల్ల కలిగే లాభాలెన్నో తెలుసుకుందామా మరి..
- లవంగాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంచుతాయి. కండరాలు, కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి.
- కాలేయ సంబంధిత సమస్యలను అదుపులోకి తీసుకువస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి.
- రోజూ కూరల్లో వాడడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైమ్‌లు జీర్ణాశయంలో విడుదలవుతాయి.
- వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనంమీద కాసేపు ఉంచి పొడి చేసి తెనెలో కలిపి తీసుకుంటే మేలు.
- షుగర్ వ్యాధితో బాధపడేవారు లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఫ్లవనాయిడ్స్ శరీరానికి అందడంవల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.
-మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఆరోగ్యపరంగా లవంగాలు ఎంతో మేలు చేస్తాయి.
- తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగాల పొడి, రాతి ఉప్పు కలిపి తాగాలి. చక్కని ఉపశమనం లభిస్తుంది.

-నీలిమ సబ్బిశెట్టి