ఐడియా

ఆహారమే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు సరైన ఆహారం తీసుకోవాలి. దానితో పాటు కొంత వ్యాయామాలు చేస్తే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. అయితే కొంతమంది అధికంగా పనిచేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. నిద్ర కూడా సరిగ్గా పోరు. ఇలాంటివారికి కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకుంటే మంచిది. వ్యాధినిరోధక శక్తి పెంచడంలో విటమిన్ ‘సి’ ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, బొప్పాయి, జామ, ఉసిరిలు తీసుకుంటే మంచిది. విటమిన్ బి12 శక్తిసామర్థ్యాలను పెంచుతుంది. మాంసకృత్తులు, కూరగాయల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. రోజుకో కోడిగుడ్డు తీసుకున్నా సరిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ప్రొటీన్స్ అనేవి ఒత్తిడిని తగ్గిస్తుంటాయి. గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. కొవ్వు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటే మంచిది. జింక్ ఎక్కువగా ఉండే పప్పులు, గింజలు, బీన్స్, చిరుధాన్యాలు తీసుకోవాలి, ఇది పిల్లల్లో శక్తిసామర్థ్యాలను పెంచుతుంది. ఈ పదార్థాలు ఆహారంలో ఉన్నాయో, లేవో చూసుకుంటే సరిపోతుంది.