ఐడియా

ప్రకాశవంతమైన కళ్లకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన కళ్లు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి? అలాంటివారు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా ప్రకాశవంతమైన, అందమైన కళ్లను సొంతం చేసుకోవచ్చు.
* డీ హైడ్రేషన్ శరీరానే్న కాదు, కంటి తెలుపుదనాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజు మొత్తంలో ఎక్కువ నీటిని తాగాలి. జ్యూస్‌ల వంటివి తాగినా మంచిదే.. కూల్‌డ్రింక్స్ వంటివి మాత్రం ఆరోగ్యానికే కాదు.. కళ్లకు కూడా హానికరమే..
* పొగ, దుమ్ము వంటి ఇతరేతర కారకాలు అలర్జీలను కలుగజేసి కంటి తెలుపుదనాన్ని ప్రభావితపరుస్తాయి. కాబట్టి ఇలాంటి కారకాలకు దూరంగా ఉండటం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, కంటి తెలుపుదనాన్ని కాపాడుకోవచ్చు.
* క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని, తెలుపుదనాన్ని చక్కగా కాపాడుతుంది. క్యారెట్‌లో విటమిన్ ‘సి, ఎ’లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి క్యారెట్ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడి కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి.
* సూర్యకాంతికి కళ్లు బహిర్గతమవకుండా చూసుకోవాలి. సూర్యకాంతిలో యువి ఎ, యువిబి రేస్ వల్ల కళ్లు పసుపు రంగులోకి మారతాయి. అందువల్ల బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సన్‌గ్లాసెస్‌ను ధరించాలి.
* కంటికి మంచి కంపెనీకి చెందిన బ్లూ ఐ లైనర్ లేదా మస్కరాను వాడటం వల్ల కళ్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. కంటికి సంబంధించిన కాటుక కానీ, ఐ లైనర్ కానీ ఆరునెలలకు మించి వాడకూడదు. కొనేటప్పుడు తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్టాకా, కాదా అని చూసుకుని మరీ కొనుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.