ఐడియా

పక్క తడిపే అలవాటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా పిల్లలు అయిదు సంవత్సరాలు వచ్చేంతవరకు పక్క తడుపుతుంటారు. ఐదు సంవత్సరాల తర్వాత వారికి మూత్రాన్ని నియంత్రించే పట్టు వస్తుంది. కొంతమంది పిల్లల్లో అయితే అయిదు సంవత్సరాలు దాటినా పక్క తడిపే అలవాటు ఉంటుంది. అలాంటి పిల్లల్లో మూత్రాశయం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ ఉందేమో చూడాలి. లేదా పిల్లల వైద్య నిపుణుడినే కాదు, యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించాలి. వాళ్లు మూత్రనాళ వ్యవస్థలో ఏమైనా సమస్యలేమైనా ఉన్నాయేమో చూస్తారు. సాధారణంగా పిల్లలకు ఐదేళ్లు ఉన్నప్పుడు మానసిక పరిణితి వచ్చి పక్క తడపరు. ఒకవేళ పెద్ద వయస్సు వచ్చినా నిద్రలో మూత్ర విసర్జన చేస్తున్నారంటే వారికి మూత్రాశయం నియంత్రణలో లేనట్లే.. దీన్ని వైద్య పరిభాషలో ప్రైమరీ ఎన్‌యూరిసిస్ అంటారు. సాధారణంగా ఐదు సంవత్సరాలకు మూత్రాన్ని కంట్రోల్ చేసుకోవడం వస్తుంది. అయిదేళ్ల తరువాత తిరిగి ఈ సమస్య ఎదురైతే దీన్ని సెకండరీ ఎన్‌యూరియస్ అంటారు. శారీరక, మానసిక కారణ వల్ల పిల్లలు పక్క తడుపుతుంటారు. కాబట్టి శారీరక సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించాలి. ఆందోళన, మానసిక వ్యాకులత, ఇంట్లో, స్కూల్లో సమస్యలు, కలతలు, ఉద్యోగం.. వంటి మానసిక సమస్యలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. ఈ సమస్య ఉన్న పిల్లల తల్లిదండ్రులు ముందు ఓపికగా ఉండాలి.
* పక్క తడిపే పిల్లలను తిట్టడం, కొట్టడం వెక్కిరించడం వంటివి చేయకూడదు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
* పిల్లలకు రాత్రి ఏడుగంటలలోపు నీళ్లు తాగించాలి. పడుకునేటప్పుడు నీళ్లు తాగనివ్వకూడదు.
* పడుకునేముందు పిల్లలను తప్పనిసరిగా బాత్రూంకి పంపించాలి. మధ్యమధ్యలో మెలకువ వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు ఓపిగ్గా బాత్రూంకి తీసుకెళుతూ ఉండాలి.
* పిల్లల్లో బిహేవియర్ మాడిఫికేషన్ చేయాలి. మరొకటి బ్లాడర్ ట్రైనింగ్ పద్ధతి. ఇందులో మూత్రాన్ని నియంత్రించుకునే పద్ధతిని నేర్పిస్తారు.