ఐడియా

చర్మసౌందర్యం ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్ టాన్ నుంచి రక్షణ పొందేందుకు కాస్మొటిక్ ప్రొడక్ట్స్, బ్లీచింగ్ వంటి విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇలాంటివి వాడటం చర్మానికి హానికరం. కాబట్టి సహజమైన చిట్కాలను వాడటంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, సన్ టాన్ కూడా తొలగిపోతుంది. సన్ టాన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల, ఎండలో తిరగడం వల్ల, కాలుష్యం వల్ల కూడా సన్ టాన్ వస్తుంది. ఈ సమస్యను తగ్గించు కోవాలంటే అప్పడప్పుడూ ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను, ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా సన్ టాన్‌ను తొలగించుకోవచ్చు.
* బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్టులా తయారుచేసి చేతులకి, ముఖానికి, మెడకు, ఎక్కడైతే టాన్ ఉందో అక్కడ రాయడం వల్ల టాన్ పోయి చర్మానికి ఉండే సహజరంగు వచ్చేస్తుంది. ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* తేనెను, నిమ్మరసాన్ని కలిపి పేస్టులా తయారుచేసి ఎక్కడైతే టాన్ ఉందో అక్కడ ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పది, పదిహేను నిముషాలు ఉంచి తరువాత చల్లని నీటితో కడగాలి. కడిగిన వెంటనే కాటన్ టవల్‌తో తడిని గట్టిగా తుడవకుండా నెమ్మదిగా తడిని గుడ్డతో పీల్చుకునేట్లు అద్దాలి. సన్ టాన్ పోగొట్టుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన పద్ధతి.
* వెనిగర్, నీరు సమాన నిష్పత్తిలో తీసుకుని బాగా కలపాలి. చేతులను ఈ నీటిలో ఐదు నుంచి పది నిముషాలు ఉంచి తీసిన తరువాత చల్లని నీటితో చేతులను కడగాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే చేతులపై ఏర్పడిన టాన్ తొలగిపోతుంది. ఎండలో, వాతావరణ కాలుష్యంలో బండి నడిపేవారికి చేతులపై ఏర్పడిన టాన్‌ను పోగొట్టుకోవడానికి ఇది చక్కటి చిట్కా.
* సన్ టాన్‌ను తొలగించుకోవడానికి నిమ్మరసం, దోసకాయ రసం, గులాబీ నీటిని కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు, చేతులపై అప్లై చేయాలి. పది, పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం సన్ టాన్‌ను తొందరగా పోగొట్టడానికి సహకరిస్తుంది. నిమ్మరసాన్ని సన్ టాన్ ఉన్న దగ్గర రాస్తూ మసాజ్ చేసి పది, పదిహేను నిముషాల తర్వాత ఆ సొల్యూషన్ అంతా ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. నిమ్మలోని సిట్రిక్ ఆసిడ్, గులాబీ నీళ్లలోని చల్లదనం సన్ టాన్ తొలగించేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని తయారుచేసుకుని వారం రోజుల పాటు రిఫ్రిజిరేటర్లో కూడా నిలువ చేసుకోవచ్చు.
* గుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల తేనె, ఒకటిన్నర చెంచా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఇరవై నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముఖం మెరుస్తూ కాంతులీనుతూ ఉంటుంది.
* గుడ్డులోని తెల్లసొనలో మూడు చెంచాల కీరదోసరసం కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దనా చేయాలి. ఇది పూర్తిగా ఆరాక ముఖం కడగాలి. ఈ మిశ్రమాన్ని రాసుకున్నప్పుడు అస్సలు మాట్లాడ కూడదు. లేకపోతే చర్మం ముడుతలు పడిపోవచ్చు.
* రెండు విటమిన్ మాత్రలను కట్‌చేసి అందులోని నూనెను ఒక కప్పులో వేయాలి. అందులో రెండు చెంచాల పెరుగు, నిమ్మరసం కలిపి ముఖం, మెడకు రాయాలి. పది నిముషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
* గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా బియ్యం పిండిని వేసి బాగా గిలకొట్టాలి. శుభ్రం చేసిన ముఖానికి ఈ మిశ్రమాన్ని పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం కాంతులీనుతుంది.
* ఆలివ్ నూనె, జొజోబా నూనెను ముఖానికి పూసి బాగా మర్దనా చేసి కాసేపు వదిలేయాలి. తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల చర్మం బిగుతుగా, అందంగా, మెరుస్తూ ఉంటుంది.