ఐడియా

ఆహారం నమిలే తింటున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పటి నుంచి తల్లి ఆహారం బాగా నమలాలని, అలా చేస్తేనే జీర్ణం అవుతుందని చెబుతూనే ఉంటుంది. తరువాత పుస్తకాల్లో కూడా దీని గురించి చదువుకున్నాం. కానీ నేడు.. తినే సమయం లేదనో, హడావుడిగా పరిగెట్టాలనో గబాగబా తినేస్తుంటారు. ఇలా ఆహారాన్ని నమిలి తినకపోతే లావైపోతారు అని చెబుతున్నారు నిపుణులు. ఈ యాంత్రిక యుగంలో సెడంటరీ జీవన విధానం పెరిగిపోతుంది. భౌతికంగా కష్టపడే ఉద్యోగాలు, పనులూ తగ్గిపోయి మానసికంగా శ్రమించే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. ఈ సమన్వయంలోనే ఆహారం అశ్రద్ధ అవుతుంది. భారతీయులు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో ఆహారాన్ని చాలా వేగంగా తింటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇది ఆరోగ్యానికి చాలా ముప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని నమిలి తినే తీరిక లేక మింగేస్తుండటంతోనే జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతున్నాయి.
* ఆహారాన్ని నమిలి తినడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది. ఆహారం బాగా నమలడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. మెదడు కూడా వెంటనే ఉత్తేజితమవుతుంది.
* జీర్ణక్రియలో మెదడుది కీలకపాత్రే.. ఎందుకంటే మనకు బాగా ఆకలి వేసినప్పుడు.. ఎదురుగా ఆహారం ఉందనుకోండి.. వెంటనే మెదడు ఉత్తేజితమవుతుంది. ఫలితంగా నోట్లో లాలాజలం విడుదల అవుతుంది. ఇందులో ఉన్న ఎంజైములు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే తీసుకున్న ఆహారాన్ని ఎంత నమిలితే అంత ఎక్కువగా లాలాజలం ఉత్పత్తి అవుతుంది.
* తిన్న ఆహారం జీర్ణాశయాన్ని చేరాకే జీర్ణం కావడం మొదలు అవుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆహారం నోటిలోనే జీర్ణం కావడం ప్రారంభమవుతుంది. నోటిలోని అమైలేజ్, లైపేజ్ అనే ఎంజైములు ఈ పనిని చేస్తాయి. ఫలితంగా జీర్ణక్రియ ఇక్కడి నుండే మొదలవుతుంది.
* సమయాభావం వల్లనో, మరేదైనా కారణం వల్లనో ఆహారాన్ని వేగంగా తింటే నమలడానికి ఆస్కారం ఉండదు. ఫలితంగా జీర్ణానికి తోడ్పడే ఎంజైముల, ఆమ్లాల విడుదల మందగిస్తుంది. దీనివల్లనే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఏర్పడతాయి.
* ఆహారాన్ని వేగంగా తినడం వల్ల ఎక్కువ తినేసే ఆస్కారం కూడా ఉంది. నములుతూ, నిదానంగా తినకపోవడం వల్ల కడుపు నిండిన భావన త్వరగా కలగదు. ఫలితంగా శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంత మాత్రమే వినియోగించుకుని మిగిలిన ఆహారం కొవ్వు రూపంలో శరీర భాగాల్లో పేరుకుపోతుంది. ఈ కొవ్వు వల్ల అన్ని జబ్బులనూ ఆహ్వానించినట్లే అవుతుంది.
* పిల్లలకు ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేయాలి. అందుకే పిల్లలు అన్నం తినేటప్పుడు సెల్‌ఫోన్లలో ఆటలు ఆడటం, టీవీ చూడటం వంటివి చేయకుండా చూడాలి. వారు ఏం తింటున్నారో..? ఎంత తింటున్నారో..? ఎలా తీసుకుంటున్నారు? అన్న విషయాన్ని వారికి తెలిసేలా చేయాలి.
* ఆహారం తీసుకునేముందు ఆరుసార్లు గట్టిగా శ్వాసించాలి. దీనివల్ల శరీరం ఆహారం తీసుకోవడానికి సన్నద్ధం అవుతుంది. ఈ అలవాటు పిల్లలకు కూడా నేర్పించాలి.