ఐడియా

ఇయర్ ఫోన్స్ వాడొచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతం అంటే ఇష్టం ఉండని వారెవరు? కానీ మనం వినే సంగీతం చాలామంది ఇబ్బందిగా మారచ్చు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. అయితే నాలుగు నిముషాలకు మించి ఇయర్ ఫోన్స్‌తో సంగీతం వినడం ప్రమాదకరమని మీకు తెలుసా? ఇదే కొనసాగితే వినికిడి సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ్చే ప్రమాదముందట. అందుకే ఇయర్ ఫోన్స్‌తో ఎక్కువసేపు మ్యూజిక్ వినడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. హెయిర్ డ్రయర్‌ని కూడా పదిహేను నిముషాలకు మించి వాడకూడదట. అరవై సెంటీమీటర్ల దూరంలో ఉన్న అలారం చేసే శబ్దం అరవై డెసిబుల్స్ ఉంటే దానే్న మంచానికి దగ్గరగా ఉంచకూడదంటారు డాక్టర్లు. ఎందుకంటే చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేరు. అంటే ఇక దానికి ఎటువంటి చికిత్సా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో హియరింగ్ ఎయిడ్ వాడాల్సిందే.. లేదంటే జీవితాంతం చెవుడుతో బాధపడాల్సి వస్తుంది. అందుకే అరవై డెసిబుల్స్ పైబడిన స్థాయి శబ్దాలను దగ్గరగా వినడం హానికరమని గుర్తించాలి. ఇక చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే ప్రమాదమేగా మరి! చెవుడు రావడానికి ప్రధాన కారణం వయసు పెరగడమైతే.. పెద్ద శబ్దాలను దగ్గరగా వినడం రెండో కారణమని భారతదేశానికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ చెబుతోంది. పెద్ద శబ్దాల వల్ల కలిగే చెవుడుకి ఎలాంటి చికిత్స, పరిష్కారం లేదు. కాబట్టి ఇకనుంచైనా ఇయర్ ఫోన్స్ వాడకంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది.