ఐడియా

పండ్ల తొక్కులు పనికొస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండ్లను వాడినంతగా పండ్ల చెక్కులను వాడము. చెత్త డబ్బాల్లో వేసేస్తుంటాము. అయితే అన్ని రకాల పండ్ల చెక్కులు కాదు గానీ కొన్నిరకాల చెక్కులు మాత్రం పనికివస్తాయి.
ఒక విధంగా చెప్పాలంటే అవి కూడా మేలు చేసే ఆహార పదార్థాలే. అలాంటి కొన్ని ఆహార పదార్థాల్లో మనకు తెలియని ఉపయోగం ఉంటుంది. కొన్ని మనం అనుకున్నంత చెడ్డవీ కాకపోవచ్చు. అటువంటివాటిపైన కొంతైనా అవగాహన ఉండాలి.
చాలామందికి యాపిల్‌పై చెక్కును తీసేసి తినే అలవాటు వుంటుంది. కానీ ఎముకలకు ఉపయోగకరమైన ‘బోరోన్’ ఈ తొక్కలో లభిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించే యాపిల్‌లో 5 గ్రాముల పీచులో మూడింట రెండు వంతులు ఈ తొక్కలోనే ఉంటుంది. బంగాళా దుంపలపై తోలు కూడా ఉపయోగపడేదే. ఈ పీల్‌లో 4 మిల్లీ గ్రాముల ఐరన్, 20 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటాయి.
దుంప ప్లెష్‌తో పోల్చితే ఐరన్ ఒక శాతం కంటే తక్కువ. 10 మిల్లీ గ్రాముల కాల్షియం వ్యత్యాసం ఉంటుంది. క్యాలీఫ్లవర్‌లోని తెల్లని పువ్వు వాడి ఆకులు, కాడల్ని పారేస్తుంటాము. కానీ క్యాలీఫ్లవర్ కాడలనిండా పీచు ఉంటుంది. ఆకుల్లో బీటా కెరోటిన్ అధికం. గుడ్డులోని పచ్చసొన తింటే కొవ్వు పెరుగుతుందన్న భయం అనేకమందికి ఉంటుంది.
కానీ గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ 274 మిల్లీగ్రాములు కాక 213 మిల్లీ గ్రాములే ఉంటుంది. కొవ్వు వుండేది 5 గ్రాములు. రోజుకో గుడ్డు తినడం శక్తికి, ఆరోగ్యానికి మంచిది. కాకరకాయ చెక్కుని కారంతో కలిపి అన్నంలో తింటే షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది. ఇలా ప్రతిదీ పనికివచ్చేదే. వాటికి తగిన ఉపయోగాల గురించి తెలుసుకొని వాడుకోవటం ఉత్తమం.

- హిమజారమణ