ఐడియా

చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, స్థూలకాయం, ఒత్తిడి.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు... నేడు చాలామంది గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో మందులను వాడుతుంటారు. ఈ మాత్రలు తీసుకోవడంవలన సమస్యలు తగ్గినా... సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కింద పేర్కొన్న కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి.
* ఓ కప్పు యాపిల్ పండు ముక్కలపై చెంచా ఆలివ్ నూనె వేసి తినాలి. ఇలా రోజూ చేస్తే యాపిల్‌లోని ఫైబర్, ఆలివ్‌లోని పోషకాలతో త్వరలోనే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. దీన్ని పాటిస్తూ మసాలాలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారాన్ని తీసుకొనేందుకు ఆసక్తిని చూపించాలి.
* శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుండటంతోపాటు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
* ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించి ఆ నీటిని వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా చేయడంవల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని తాగినా సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది.
* గుప్పెడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పువేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తిని, నీరు తాగినా చాలు. గ్లాస్ నీరు లేదా తేనే లేదా నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే అజీర్ణ సమస్య తగ్గుముఖం పడుతుంది.
* గ్లాసుడు నీళ్లలో కొన్ని సోంపు గింజలను వేసి మరిగించి, వడకట్టి వేడిగా ఉండగానే తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.